ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ ఉద్యోగులచే నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన......

ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ ఉద్యోగులచే నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన......

విశ్వంభర, మహబూబాబాద్ :-  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కోరుతూ, తెలంగాణ ఉద్యోగ, గెజిటెడ్, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షన్ల ఐక్య కార్యచరణ సమితి మరియు తెలంగాణ మున్సిపల్ సెంట్రల్ ఫోరం రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు, శుక్రవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ముందు తెలంగాణ మున్సిపల్ సెంట్రల్ ఫోరం జిల్లా సంఘం ఆధ్వర్యంలో భోజన విరామ సమయంలో అన్ని తరగతుల ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలను ధరించి, నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ మున్సిపల్ సెంట్రల్ ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి సింగు రమేష్, సంఘం జిల్లా నాయకులు చింతల శ్రీనివాస్ లు మాట్లాడుతూ, ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం  ( సిపిఎస్ ) ను రద్దుచేసి, పాత పెన్షన్ విధానాన్ని ( ఓ పి ఎస్ )  ను అమలు చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులందరికీ స్మార్ట్ హెల్త్ కార్డులను మంజూరు చేయాలని ఉద్యోగుల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని తదితర రాష్ట్ర ప్రభుత్వం ముందుంచిన 63 డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని, లేని తీరుకు, రానున్న కాలంలో ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రం  ను మేనేజర్ శ్రీధర్ కు అందజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆర్.ఓ, ఏ. రఘు, నాయకులు రామంచ సుధాకర్, కల్ రాం, భరత్ చంద్ర, వెంకట్ నర్సు, గౌతమి, శ్రీధర్, భాస్కర్, మమ్ముట్టి లతోపాటు మున్సిపల్ అన్ని శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.

Tags: