అనుమతి తీసుకొని ఇల్లు నిర్మించుకోవాలి : సర్పంచ్ నవీన్
విశ్వంభర, మహేశ్వరం : మహేశ్వరం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ద్వారా అనుమతులు పొందకుండా నూతనముగా గృహ నిర్మాణం చేపడుతున్న గృహ నిర్మాణ యజమానులకు గ్రామ పంచాయతీ కార్యాలయము మహేశ్వరం నుండి అనుమతులు తీసుకొని నిర్మాణములు చేపట్టాలని తెలుపుతూ నోటీసు జారీ చేసి సెట్ బ్యాక్ వదిలి నిర్మాణం చేయాలని సూచనలు చేసి, మార్కింగ్ చేసిన తర్వాత కూడా సెట్ బ్యాక్ చేయకుండా గ్రామ పంచాయతీ ద్వారా అనుమతులు పొందకుండానే నూతన గృహ నిర్మాణాలు చేపడుతున్న వారి యొక్క గృహ నిర్మాణాలను గ్రామ సర్పంచ్ మునగపాటి నవీన్ పాలక వర్గ సభ్యులు పంచాయతీ కార్యదర్శి సుజాత కలిసి అక్రమ గృహ నిర్మాణాలను జేసీబీ ద్వారా కూల్చివేయడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మునగపాటి నవీన్ మాట్లాడుతూ, గ్రామ పంచాయతీ మహేశ్వరం పరిధిలో ఎవరైన నూతన గృహ నిర్మాణాలు చేపట్టదలచిన వారు తప్పకుండ గ్రామ పంచాయతీ అనుమతి పొంది, గ్రామ పంచాయతీ కార్యాలయము ద్వారా సూచించిన కొలతల ప్రకారం రోడ్డు నుండి సెట్ బ్యాక్ వదిలి నిర్మాణం చేపట్టవలసిందిగా గ్రామ ప్రజలకు తెలియజేశారు. ఈ సూచనలు పాటించని గృహ యజమానులపై తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మునగపాటి నవీన్, ఉప సర్పంచ్ జొరల రమేశ్, వార్డు మెంబర్స్ తింగిరికారి బేబీ, పోల్కం సునీత, ఆవులకాడి కిష్టామ్మ, స్వర్ణగంటి సంజీవ, మహమ్మద్ ఆజం, కడమోని స్వాతి,కాకి పరమేష్, దిద్దెల శ్రీశైలం, ఆకుల వీరిబాబు, సున్నం స్వప్నా, జటావత్ రుకేష్, రెవెళ్ళ చంద్రమౌళి మరియు ,భవన కార్మిక సంఘం మండల అధ్యక్షులు జోరల శ్రీశైలం, మహేశ్వరం గ్రామ భవన కార్మిక సంఘం అధ్యక్షులు పెయ్యల రవి, ఉపాధ్యక్షులు ఖానపురం రాజు,సలేకుల పర్వతాలు,భవన కార్మిక సంఘం కార్యదర్శి స్వర్ణగంటి కన్నయ్య ,ఖానపురం చెన్నయ్య,కటికల శంకర్, ఆశనగారినరసింహ,పంచాయతీ కార్యదర్శి సుజాత, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.



