హెల్త్ క్యాంప్ విజయవంతంగా
On
విశ్వంభర, గుండాల: 99 రోజుల ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా బండకొత్తపల్లి గ్రామంలో మెగా హెల్త్ క్యాంప్ విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ గద్వాల ఉపేందర్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. మండల వైద్యాధికారి డాక్టర్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆరోగ్య శిబిరంలో గ్రామ ప్రజలకు బీపీ, షుగర్, కంటి పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ గోపాల్ దాస్ యాదగిరి, గోపాల్ దాస్ రాములు, హెల్త్ ఆఫీసర్ పి. వెంకటేశ్వర్లు, డాక్టర్ కరుణ, ఐటీ రహీం, ఆశ వర్కర్లు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు పాల్గొన్నారు.



