హయత్ నగర్ డిపో వద్ద ఆర్టీసీ కార్మికుల నిరసన. ఆర్టీసీ నీ ప్రభుత్వంలో విలీనం చేయాలి.- తెలంగాణ ఆర్టీసీ కార్మిక సమాఖ్య నాయకులు. - కొమిరెల్లి రాజిరెడ్డి
విశ్వంభర, హయత్ నగర్ :- ఆర్టీసి రక్షణ కోసం, సమస్యల సాధన కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకై ఏప్రిల్ 22నుండి 2026 మొదటి డ్యూటి నుండి జరుగు సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ TGSRTC జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో హయత్ నగర్ వద్ద ఆర్టీసీ యూనియన్ నాయకులు, కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. హాయత్ నగర్ 1& 2 డిపోలు వద్ద సమ్మెకు సమాయత్తం చేయడానికి ఏర్పాటు చేసిన మహాధర్నాకు కొమిరెల్లి రాజిరెడ్డి తెలంగాణ ఆర్టీసీ కార్మిక సమాఖ్య నాయకులు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కార్మిక సంఘాల తో ఇప్పటి వరకు చర్చించకపోవడాన్ని తీవ్రంగా ఖండించారు.తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మిక సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరించి సమ్మె నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసారు. యూనియన్లతో చర్చించకుండా సమస్యలు పరిష్కరించకుండా కాంగ్రెస్ ప్రభుత్వమే సమ్మె చేసే పరిస్థితులు కల్పిస్తుంది. అనివార్యమైతే ఆ సమ్మె లో తెలంగాణ ఆర్టీసీ కార్మిక సమాఖ్య సభ్యులు అందరు స్వచ్చందంగా పాల్గొని ముందుండి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని , కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించి , ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలనీ కోరుతూ పలు డిమాండ్ల ప్రస్తావన తీసుకువచ్చారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎ.సి.లింగం అద్యక్షతన జరిగింది.ఈ ధర్నా కార్యక్రమాని బి.వెంకటయ్య గౌడ్.. డి.వెంకటేష్,యం.ఎస్.రెడ్డి బాలనర్సిహ్మ, ధర్మారెడ్డి , వెంకటయ్య.యం.ఎన్.రావు,కె.వి.రావు.పి.వి.రెడ్డి,పి.ఎస్.రావు ,హాయత్ నగర్ 1&2 డిపోల నుండి వందలాది మంది కార్మికులు పాల్గొన్నారు.
డిమాండ్స్
1. ఆర్టీసి ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను వెంటనే ప్రారంభించాలి.
2. 2021 వేతన సవరణ 30% ఫిట్మెంట్ తో అమలు చేయాలి. 2025 వేతన సవరణ అమలు చేయాలి
3. మహాలక్ష్మి పథకం కింద ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులు ప్రతినెల 400 కోట్లు ఆర్టీసికి ఇవ్వాలి.
4. ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి / బెడ్ విన్నర్ పోస్టులను పర్మినెంట్ ఉద్యోగాల కింద భర్తీ చేయాలి.
5. ట్రేడ్ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేసి, గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలి.
6. ఆర్టీసి ఉద్యోగులపై పనిభారాలు తగ్గించాలి / కండక్టర్ డ్రైవర్లలపై KMPL, EPK వేధింపులు మానుకోవాలి.
7. ఎలక్ట్రిక్ బస్సులను రాష్ట్ర ప్రభుత్వమే కొని ఆర్టీసికి ఇవ్వాలి / ఆర్టీసి స్థలాలను ఈనీ బస్సులకు ఇవ్వరాదు.
8. అద్దె బస్సులను, అద్దె బస్సుల డ్రైవర్లలను ఆర్టీసిలో విలీనం చేసుకోవాలి (గతంలో సూదిరిగా జాతీయం చేసుకోవాలి)
9. గ్రేటర్ హైదరాబాద్ జోన్లో పనిచేస్తున్న సిబ్బందిని కరీంనగర్ జోన్, హైదరాబాద్ జోన్లకు బలవంతగా బదిలి చేసి ఉత్తర్వులను రద్దు చేయాలి /2019 నమ్మే కాలంలో నమోదైన పోలీస్
కేసులను ఎత్తివేయాలి.
10. మహిళా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలి.
11. రద్దీకనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచాలి / అన్ని కేటగిరీలలోని ఖాళీలను భర్తీ చేయాలి.
12. రిటైరైన ఉద్యోగుల బకాయిలను అన్నిటినీ చెల్లించాలి /చెల్లించటంతో పాటు దీర్ఘకాలిక పెండింగ్ సమస్యలను పరిష్కరించాలి.



