ర్దార్ నగర్‌లో ఘనంగా హిందూ సమ్మేళనం 

ర్దార్ నగర్‌లో ఘనంగా హిందూ సమ్మేళనం 


  • వేలాదిగా తరలివచ్చిన భక్తులు

షాబాద్, విశ్వంభర: చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండలం సర్దార్ నగర్ శివాలయంలో హిందూ సమ్మేళన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల నుండి వేలాదిగా హిందూ బంధువులు హాజరై విజయవంతం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాతీయ సాహిత్య పరిషత్ ప్రాంత సంఘటన మంత్రి పి. భాస్కర్ యోగి, తెలంగాణ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీ శంకర స్వామీజీ విచ్చేసి సభను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,  హిందూ సమాజం సంఘటితంగా ఉండటం అత్యవసరమని, హిందూ మత పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. పి. భాస్కర్ యోగి మాట్లాడుతూ హిందూ బంధువులంతా ఏకం కావాలని, హిందూ మత మూలాలు, సంప్రదాయాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. శ్రీ శంకర స్వామీజీ మాట్లాడుతూ ప్రపంచంలోని అన్ని మతాలలో హిందూ మతం గొప్పదని, దాని చరిత్ర, సనాతన ధర్మం విశిష్టతను యువతరం తెలుసుకోవాలని అన్నారు. శారదా దయానిధి మాట్లాడుతూ “గడప లోపల కులం, గడప బయట హిందువులం – అందరం ఒకటే” అనే సందేశాన్ని అందించారు. హిందూ సమ్మేళన కార్యక్రమాల ముఖ్య ఉద్దేశం హిందువులంతా సంఘటితం కావడమేనని నిర్వాహకులు తెలిపారు. భజన పాటలతో మన్మరి భజన మండలి సభ్యులు సభను ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు శంకర్ రావ్ జాహెవ్, ఉపాధ్యక్షులు రాంచంద్రయ్య, కార్యదర్శి ఆంజనేయులు, గూడెం రమేష్, మల్లేష్, ప్రవీణ్, శ్రీధర్ రెడ్డి, మురళి, శ్రీధర్, నరేష్, విష్ణు, సూర్య ప్రకాష్, రాజు, నవీన్, మహేష్, అలాగే వివిధ గ్రామాల సర్పంచులు, డిప్యూటీ సర్పంచులు, చైర్మన్‌లు, వైస్ చైర్మన్‌లు మరియు అనేక మంది హిందూ బంధువులు పాల్గొన్నారు.

Tags: