మొక్కజొన్న పంట క్షేత్ర ప్రదర్శన
విశ్వంభర, ఇనుగుర్తి: మండల కేంద్రం ఇనుగుర్తి శివారులో రైతు నాగలి సంపత్ కు చెందిన మొక్కజొన్న క్షేత్రాన్ని ఇనుగుర్తి తో పాటు 140 మంది పరిసర గ్రామాల రైతులు శుక్రవారం సందర్శించారు. మొక్కజొన్న పంట చేను చూసి సంతోషం వ్యక్తం చేస్తూ ఏ కంపెనీ ఏ రకానికి చెందినదని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా టిఎస్ఎం నాగేంద్రబాబు మాట్లాడుతూ , అంకూర్ కు చెందిన భాస్కర రకం మొక్కజొన్నను సంబంధిత రైతు ఎంచుకొని విత్తుకున్నారని చెప్పారు.ఈ భాస్కర్ రకము మొక్కజొన్న గాలి వర్షం వచ్చినా అడ్డం పడదని, కంకి కలరు బాగుంటుందని, చివరిదాకా గింజలు ఉండి మంచి దిగుబడి వస్తుందని చూపిస్తూ వివరించారు. మార్కెట్లో అధిక ధర పలుకుతుందని, దీంతో రైతులు మంచి లాభాలు పొందవచ్చన్నారు. కోమటిపల్లి సర్పంచ్ మద్దెల బిక్షపతి గౌడ్, ఏఎంసి డైరెక్టర్ కొట్టం రాము పాల్గొని రైతులకు సంబంధిత మొక్క జొన్న పై మంచి సూచనలు ఇచ్చారు. అనంతరం రైతులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిబ్యూటర్ ఎడవల్లి శ్రీనివాసరెడ్డి, ఇనుగుర్తి డీలర్ కాసాని ఐలయ్య, గండి శ్రీనివాస్, సృజన్, యాకన్న, వీరన్న, బాలు నాయక్ తదితరులు పాల్గొన్నారు.



