పదవ తరగతి పరీక్షా ఫలితాలలో NSR విద్యార్థుల ప్రభంజనం.

పదవ తరగతి పరీక్షా ఫలితాలలో NSR విద్యార్థుల ప్రభంజనం.

విశ్వంభర హనుమకొండ జిల్లా:-వరంగల్ జిల్లా ఆరేపల్లి, కొత్తపేట క్రాస్ రోడ్ లోని NSR ఇంటర్నేషనల్ పాఠశాల విద్యార్థులు CBSE బోర్డు ప్రకటించిన పదవ తరగతి వార్షిక పరీక్షలలో అద్భుత ఫలితాలు సాధించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటుచేసిన ప్రత్యేక అభినందన సభలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను వారి తల్లిదండ్రుల సమక్షంలో  సన్మానించడం జరిగింది. ఈ అభినందన సభను ఉద్దేశించి ఎన్ ఎస్ ఆర్ పాఠశాల చైర్మన్  నాయినేని సంపత్ రావు మీడియాతో మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులు అందించిన ప్రోత్సాహంతో ప్రతి సంవత్సరం 100% ఫలితాలను సాధిస్తూ వస్తున్నామన్నారు. అలాగే ఎక్కువగా గ్రామీణ నేపథ్యం కలిగిన విద్యార్థులను ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్ది జాతికి అందించడం చాలా గర్వకారణంగా ఉందన్నారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్  కళింగ రావు మాట్లాడుతూ అత్యుత్తమ ఉపాధ్యాయ బృందాన్ని కలిగి ఎక్కడా రాజీ పడకుండా నాణ్యమైన విద్యను అందించడమే ధ్యేయంగా గడిచిన మూడు సంవత్సరాల నుండి ఉత్తమ ఫలితాలు సాధిస్తూ వస్తున్నామన్నారు. పాఠశాల డైరెక్టర్ డాక్టర్ నాగేశ్వరరావు  పిల్లలను అభినందిస్తూ మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు శాస్త్ర సాంకేతికతను అందిపుచ్చుకొని ముందుకు సాగాలని కోరారు. తదనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు  రాజ్ కుమార్ జోషి   మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభం నుండే తల్లిదండ్రుల సహకారంతో ప్రణాళిక బద్ధంగా విద్యార్థులను పరీక్షలకు తయారు చేయడం కారణంగానే 88 మంది విద్యార్థులు 100% ఫలితాలను సాధించారన్నారు. ఇందులో 60 శాతం మంది విద్యార్థులు మొదటి శ్రేణిలో మిగతావారు రెండవ శ్రేణిలో ఫలితాలు సాధించారన్నారు. ముఖ్యంగా గ్రామీణ విద్యార్థులను పట్టణాలలోని విద్యార్థులతో పోటీపడేలా,  ఇతర విద్యాసంస్థలకు భిన్నంగా విద్యార్థులను తీర్చిదిద్దామన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో  వైస్ ప్రిన్సిపాల్  శ్రీనివాస్, కోఆర్డినేటర్  మధులత, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Tags: