కేటీఆర్ ను కలసిన చేనేత ఐక్య వేదిక అధ్యక్షులు రాపోలు వీర మోహన్ . - చేనేత సమస్యలపై వినతిపత్రం అందజేత 

విశ్వంభర, హైదరాబాద్ :-  ఇటీవల చేనేతలకు గండంగా మారిన టెండర్ విధానం ప్రభుత్వం ప్రవేశపెట్టి చేనేత కార్మికుల పొట్టకొడుతున్న వైనాన్ని తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీర మోహన్ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ , ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు కు దృష్టికి తీసుకువచ్చారు. నందినగర్ లోని కేటీఆర్ నివాసంలో వారిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు.  చేనేత సమస్యలను వెంటనే పరిష్కారించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొని రావాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. పలు సమస్యలపై చేనేత కార్మికులకు సంబందించిన పథకాలపై రాపోలు వీరమోహన్ కేటీఆర్ తో సుదీర్ఘంగా చర్చించారు. కేటీఆర్ సానుకూలంగా స్పందించారని సమస్యలను ప్రభుత్వం దృష్టికి  తీసుకువెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారని రాపోలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు వేముల ఉమారాణి, ఉపాధ్యక్షులు సామల స్వప్న, గ్రేటర్ హైదరాబాద్ చేనేత ఐక్య వేదిక ప్రధాన కార్యదర్శి చెరుకు విజయ్,  పాల్గొన్నారు.

🕒 18 Apr 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/%C2%A0%E0%B0%95%E0%B1%87%E0%B0%9F%E0%B1%80%E0%B0%86%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%A8%E0%B1%81-%E0%B0%95%E0%B0%B2%E0%B0%B8%E0%B0%BF%E0%B0%A8-%E0%B0%9A%E0%B1%87%E0%B0%A8%E0%B1%87%E0%B0%A4-%E0%B0%85%E0%B0%A7%E0%B1%8D%E0%B0%AF%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B1%81%E0%B0%B2%E0%B1%81-%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8B%E0%B0%B2%E0%B1%81-%E0%B0%B5%E0%B1%80%E0%B0%B0-%E0%B0%AE%E0%B1%8B%E0%B0%B9%E0%B0%A8%E0%B1%8D-----%E0%B0%9A%E0%B1%87%E0%B0%A8%E0%B1%87%E0%B0%A4-%E0%B0%B8%E0%B0%AE%E0%B0%B8%E0%B1%8D%E0%B0%AF%E0%B0%B2%E0%B0%AA%E0%B1%88-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A8%E0%B0%A4%E0%B0%BF%E0%B0%AA%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82-%E0%B0%85%E0%B0%82%E0%B0%A6%E0%B0%9C%E0%B1%87%E0%B0%A4%C2%A0/article-14148

Tags: