నిజాయితీకి మారుపేరు గుర్రం యాదగిరి రెడ్డి

నిజాయితీకి మారుపేరు గుర్రం యాదగిరి రెడ్డి

విశ్వంభర, రామన్నపేట: నిస్వార్దానికి నిజాయితీకి మారుపేరు, మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజల మన్నలను పొందిన సిపిఐ ఎమ్మెల్యే గుర్రం యాదగిరి రెడ్డి అని సిపిఐ రామన్నపేట మండల కార్యదర్శి ఊట్కూరు నరసింహ అన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని రామన్నపేటకు 1985 నుండి 1999 వరకు మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది తన, పర భేదం లేకుండా, నిస్వార్ధంగా ప్రతి పార్టీ కార్యకర్తకు, తన దగ్గరికి వచ్చిన ప్రజలకు సేవ చేసిన వ్యక్తి సిపిఐ మాజీ ఎమ్మెల్యే గుర్రం యాదగిరి రెడ్డి అని, రైతు సంఘానికి అమూల్యమైన సేవలు అందించిన మాజీ రాష్ట్ర నాయకులు గుర్రం యాదగిరి రెడ్డి, నిస్వార్ధంగా సేవ చేసినందుకుగాను మూడుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొందారని, ప్రజాస్వామ్యంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ నిజాయితీకి నిలువుటద్దంలా ప్రజలకు సేవ చేశారని అది కమ్యూనిస్టులకున్న చిత్తశుద్ధి, నిబద్ధత అని, ఆయన జీవితం నేటి యువతకు, రాజకీయాలకు ఆదర్శమని సిపిఐ మండల కార్యదర్శి ఊట్కూరు నరసింహ అన్నారు. కొన్ని రాజకీయ కారణాల వల్ల రామన్నపేట నియోజకవర్గాన్ని నాలుగు పాయలు చేసి విడదీశారని, నేడు మనకు పునర్విభజనలో భాగంగా రామన్నపేటను తిరిగి నియోజకవర్గంగా సాధించుకునే అవకాశం ఉన్నందున అందరం కలిసికట్టుగా పోరాడి నియోజకవర్గాన్ని తిరిగి సాగించుకుందామని, రామన్నపేట నియోజకవర్గ సాధన సమితి కమిటీలో సిపిఐ భాగస్వామ్యం అయ్యి ప్రముఖ పాత్ర పోషిస్తున్నదని, కాంగ్రెస్, బిజెపి, బిఆర్ఎస్, టిడిపి, డి.ఎస్.పి, బీఎస్పీ, టీజేఎస్ అన్ని పార్టీల వారు   నియోజకవర్గ సాధన సమితిలో భాగమై పోరాడుతున్నారని, మండలంలోని అన్ని వర్గాల వారు మమేకమై ఎలాంటి అరమరికలు లేకుండా అందరి ఆలోచనలతో, మొదట నియోజక వర్గాన్ని సాధించుకుందామని, మన మండల అభివృద్ధే మొదటి ధ్యేయంగా ముందుకు సాగుదామని, నియోజకవర్గ సాధనే మన అంతిమ లక్ష్యమని ఆయన తెలియజేశారు.

Tags: