యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే  రామ్మోహన్ 

 విశ్వంభర,  పరిగి:  పట్టణంలో రూ.200 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణ పనులను ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  దూరదృష్టి, సంకల్పంతో ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్ తరాలకు నాణ్యమైన విద్యతో పాటు ఆధునిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. అన్ని సామాజిక వర్గాల ఒకేచోట విద్యను అందించాలనే లక్ష్యంతోప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ పాఠశాలను నిర్మిస్తుంది . విద్యతో పాటు ఆటలు , టెక్నాలజీని అందిపుచ్చుకునేలా వసతులు ఉంటాయని  తెలిపారు. పరిగిలో నిర్మాణంలో ఉన్న ఈ పాఠశాల పనులను వేగంగా పూర్తి చేసి, వచ్చే విద్యా సంవత్సరంలోనే విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్  చైర్మన్ పార్థసారథి పంతులు, మున్సిపల్ చైర్మన్ రంజిత వెంకటేష్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సయ్యద్ అయూబ్, పిఎసిఎస్ వైస్ చైర్మన్ రాజపుల్లారెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, పరిగి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకట్రాములు, కౌన్సిలర్ అఖిల, బాదం శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

🕒 06 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/mla-rammohan-inspected-the-construction-works-of-young-india-integrated/article-18058

Tags: