తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను సందర్శించిన మంత్రి మహమ్మద్ అజారుద్దీన్
విశ్వంభర, ఇబ్రహీంపట్నం: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలతో పాటు క్రీడా సౌకర్యాలను మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్లలోని తెలంగాణ పబ్లిక్ స్కూల్ ను రాష్ట్ర మైనార్టీ, ఎంటర్ప్రైజెస్ శాఖ మంత్రివర్యులు శ్రీ మహమ్మద్ అజారుద్దీన్ గారు సందర్శించారు. పాఠశాలకు చేరుకున్న మంత్రి గారికి అధికారులు, పాఠశాల ప్రిన్సిపాల్ గిరిధర్ గౌడ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు. తరగతి గదులు, సైన్స్ ల్యాబ్, లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్, హాస్టల్, వంటశాలను మంత్రి క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం, మంచినీరు, వసతి సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో ముచ్చటిస్తూ వారి చదువు, భవిష్యత్ లక్ష్యాల గురించి అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా పాఠశాల ప్లే గ్రౌండ్‌లో క్రికెట్ ఆడుతున్న విద్యార్థులను చూసిన మంత్రి అజహార్ ఉత్సాహంగా వారితో కలిసి బ్యాట్ పట్టారు. పాఠశాలలో క్రికెట్‌తో పాటు ఇతర క్రీడలకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలని, కోచ్‌లను నియమించాలని మంత్రి అధికారులకు ఆదేశించారు. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ "మీరు చదువుతున్న ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ దేశానికే ఆదర్శం. కేవలం చదువే కాదు, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా రాణించాలి. నాలాగే మీలో నుంచి కూడా పెద్ద క్రీడాకారులు రావాలి. కష్టపడి చదివి, క్రమశిక్షణతో ముందుకు సాగితే ఏ లక్ష్యమైనా సాధించవచ్చు" అని స్ఫూర్తిదాయకంగా ప్రసంగించారు.పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన ఇంగ్లీష్ మీడియం విద్య, వసతి, భోజనం ఉచితంగా అందించడమే తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ లక్ష్యమని, వాటిని మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.