ఆగస్టు నుంచి ఉద్యమకారుల ఓదార్పు యాత్ర
విశ్వంభర, హనుమకొండ: తెలంగాణ ఉద్యమకారుల సమస్యల పరిష్కారం, ఎన్నికల హామీల అమలు కోసం ఆగస్టు నుంచి రాష్ట్రవ్యాప్తంగా'ఉద్యమకారుల ఓదార్పు యాత్ర'** చేపట్టనున్నట్లు తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక రాష్ట్ర చైర్మన్ గుడిమళ్ల రవికుమార్ ప్రకటించారు. హనుమకొండలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన 250 గజాల ఇంటి స్థలం, నెలకు రూ.25 వేల పెన్షన్ వంటి హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేశవరావు కమిటీ ఏర్పాటు స్వాగతించదగ్గదేనని, అయితే కాలయాపన చేస్తే ప్రభుత్వం తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఉద్యమంలో సర్వం కోల్పోయిన కార్యకర్తలను పరామర్శించి వారి సమస్యలను తెలుసుకునేందుకే ఓదార్పు యాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. సమావేశంలో ఉద్యమకారులకు రూ.10 లక్షల ఉద్దీపన, ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు, ప్రతి జిల్లాలో సంక్షేమ భవనాల నిర్మాణం వంటి డిమాండ్లతో తీర్మానాలు ఆమోదించారు. అనంతరం తొలి దశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న పది మంది ఉద్యమకారులను సన్మానించారు.