బ్రాహ్మణకొత్తపల్లిలో ఘనంగా జలమహోత్సవం

బ్రాహ్మణకొత్తపల్లిలో ఘనంగా జలమహోత్సవం

విశ్వంభర, నెల్లికుదురు: అన్ని రకాల ప్రాణులతో పాటు మొక్కలు, వృక్షాలకు జలమే ఆధారమని, నీరు లేకుంటే జీవులకు మనుగడ లేదని సర్పంచి డా.చిర్ర యాకాంతం గౌడ్ అన్నారు. ప్రజాపాలన 99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా నెల్లికుదురు మండలం బ్రాహ్మణ కొత్తపల్లిలో సర్పంచి డా. చిర్ర యాకాంతం గౌడ్ అధ్యక్షతన జల మహోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. దీనికి ఆర్డబ్ల్యూఎస్ డిఈ వి.ఎస్ శ్రీనివాస్ ఏఈ  అరుణ్ కుమార్, ఏఈ (గ్రిడ్) నిశాంక్, ఏఈలు అనూష, వంశీ, యాకుబ్ పాష హాజరయ్యారు. గ్రామస్తులతో కలిసి నీటిని పొదుపుగా వాడుకుంటామని వృధా చేయమని ప్రతిజ్ఞ చేశారు. గ్రామంలోని నీటికి సంబంధించిన పి ఎన్ వాల్యూస్ టిడిఎస్ పరిశీలించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సర్పంచి మాట్లాడుతూ, గ్రామస్తులకు పరిశుభ్రమైన తాగునీటిని అందిస్తున్నట్లు తెలిపారు. అధికారులు మాట్లాడుతూ బోర్లు, ఇతర బాబుల నీరు కన్నా, పైపుల ద్వారా వచ్చే మిషన్ భగీరథ నీరు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. గ్రామ ప్రజలకు ఏమవసరమో స్థానిక సర్పంచ్ డా.యాకాంతం గౌడ్ కు పూర్తిగా అవగాహన ఉందని,ఆ మేరకే గ్రామస్తులకు మేలు చేసే విధంగా వ్యవహరిస్తున్నారని సర్పంచిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఉప్పలయ్య, ల్యాబ్ టెక్నీషియన్ భాగ్యలక్ష్మి, వార్డు సభ్యులు బొల్లు మురళి,పర్శురాములు, స్వరూప,ఎల్లమ్మ,నాయకులు అశోక్ సోమయ్య అజీమ్ గ్రామస్తులు పాల్గొన్నారు.

Tags: