న్యాయవిజ్ఞాన సదస్సులో పాల్గొన్న జడ్జీలు  

న్యాయవిజ్ఞాన సదస్సులో పాల్గొన్న జడ్జీలు  

 విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, ఇంద్రపాలనగరం గ్రామంలో మండల న్యాయ సేవా అధికార సంస్థ, మండల లీగల్ సర్వీస్ కమిటీ వారి ఆధ్వర్యంలో జరిగిన న్యాయవిజ్ఞాన సదస్సులో  రామన్నపేట మండల కేంద్రంలోని కోర్టు సీనియర్ సివిల్ జడ్జి సరిత, ప్రిన్సిపల్ జడ్జి శిరీష, సిపిడిఓ సమీరా పాల్గొని, గ్రామ ప్రజలకు బాల్య వివాహలు చేసుకోవడం వలన జరిగే నష్టాలు, భవిష్యత్తులో ఆరోగ్య పరంగా సంక్రమించే ఆరోగ్య సమస్యల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. బాల్య వివాహం చేసుకోవడం వలన న్యాయ పరంగా ఎదురయ్యే సమస్యలు, బాల్యవివాహం చేసుకున్న వారికి విధించే శిక్షలు "ఫోక్సో" చట్టాల గురించి ప్రజలకు అంగన్వాడీ, ఆశ వర్కర్లకు అవగాహన కల్పించి, మీరు సమాజంలో ఇతరులకు అవగాహనా కల్పించాలని సూచించారు. ఔట్ రిచ్ సంస్థ నుండి వచ్చిన భాగ్యలక్ష్మి మత్తు పదార్ధాల వలన కలిగే నష్టాల గురించి అవగాహన కల్పించారు. అలాగే వారికి అందించే వైద్య సదుపాయల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఇంద్రపాలనగరం గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్, ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, ప్యానెల్ సభ్యులు మామిడి వెంకట్ రెడ్డి, డేవిడ్, కోర్ట్ అటెండర్, పోలీసు సిబ్బంది, పంచాయతీ కార్యదర్శి రసూల్, అంగన్వాడీ సూపర్ వైజర్, అంగన్వాడీ టీచర్లు, ఎం.ఎల్.హెచ్.పి జ్యోతి, ఆశ వర్కర్లు, వార్డు మెంబర్లు వడ్లకొండ లక్ష్మి, పుట్టల లక్ష్మమ్మ ముత్యాలు, మాజీ ఏఎంసి డైరెక్టర్ మందడి విద్యాసాగర్ రెడ్డి, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags: