విద్యార్థులకు పోటీపడి విద్య అందించే దిశగా చర్యలు 

  •  మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్

విశ్వంభర, పెద్ద శంకరంపేట: విద్య ప్రాధాన్యత అంశంగా ప్రభుత్వ లక్ష్యం మేరకు, విద్యార్థుల‌కు ప్రపంచంతో పోటీపడే విద్య అందే దిశగా పటిష్ట చర్యలు తీసుకుంటామని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు.  జిల్లాలోని రామాయంపేట పట్టణంలో నూతనంగా నిర్మాణంలో ఉన్న. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులను అధికారులతో కలిసి కలెక్టర్ శనివారం పరిశీలించారు. ముందుగా కలెక్టర్ మ్యాప్ ను పరిశీలిస్తూ కన్స్ట్రక్షన్ విధి విధానాలు క్షుణ్ణంగా అధికారులు అడిగి తెలుసుకున్నారు
. ఈ సందర్భంగా కలెక్టర్  మాట్లాడుతూ రామాయణపేట పట్టణంలో 200 కోట్ల రూపాయల వ్యయంతో  యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులు జరుగుతున్నాయని   వేలాది మంది విద్యార్థులు విద్య అభ్యసించే విధంగా  ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల రూపుదిద్దుకుంటుందన్నారు. నిర్మాణ పనులలో నాణ్యతలో రాజీ లేకుండా ప్రస్తుతం ఉన్న వర్కర్ల కంటే 
అధికంగా వర్కర్లను ఎంగేజ్ చేసుకుని  అత్యంత నాణ్యత ప్రమాణాలతో భవన నిర్మాణ పనులు వేగంగా జరిగేలా పటిష్ట ప్రణాళిక ద్వారా చర్యలు చేపట్టాలన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి అందుబాటులోకి తీసుకురావాలని చెప్పారు.ఈ కార్యక్రమంలో డీఈఓ రాజు, విద్య ,సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, రామాయంపేట తాసిల్దార్ రజని, సీఎం ఓ రాజు, గణాంక అధికారి నవీన్ మెగా ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఆంజనేయులు, ఏ ఈ సఫి తదితరులు పాల్గొన్నారు.

🕒 26 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/steps-towards-providing-competitive-education-to-students/article-19754

Tags: