యోగతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం : ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి
విశ్వంభర, మిర్యాలగూడ : మిర్యాలగూడ పట్టణంలోని ఎన్‌ఎస్పీ లో ఆరోగ్య భారతి మిర్యాలగూడ ఆధ్వర్యంలో నిర్వహించిన12వ అంతర్జాతీయ యోగ దినోత్సవం కార్యక్రమంలో మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి యోగాసనాలు చేసి, కార్యక్రమంలో పాల్గొన్న వారితో కలిసి యోగాభ్యాసం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, యోగ భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన వరమని పేర్కొన్నారు. యోగ కేవలంశారీరక ఆరోగ్యానికేకాకుండామానసిక ప్రశాంతత,ఏకాగ్రత,ఆధ్యాత్మిక వికాసానికి కూడా ఎంతో దోహదపడుతుందనిఅన్నారు. ప్రస్తుత కాలంలో ఒత్తిడితో కూడిన జీవన విధానంలో ప్రతి ఒక్కరూ యోగను తమ దినచర్యలోభాగంచేసుకోవాలని సూచించారు. యోగ ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని, యువతతో పాటు అన్ని వయసులవారుయోగాభ్యాసాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యోగ దినోత్సవాన్నిపురస్కరించుకొని నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, యువత, క్రీడాకారులు,యోగాసాధకులు, సామాజిక కార్యకర్తలు మరియు ప్రజలు పాల్గొని యోగాసనాలునిర్వహించారుఈ కార్యక్రమంలో ఆరోగ్య భారతి ప్రతినిధులు, ప్రముఖులు,ప్రజాప్రతినిధులు, క్రీడా సంఘాల నాయకులు, యోగా శిక్షకులు తదితరులు పాల్గొన్నారు.