రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా యోగా దినోత్సవం

విశ్వంభర, రామన్నపేట: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు యోగా పట్ల అవగాహన కలిగించడం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య రాహత్ ఖానం మాట్లాడుతూ, ఆరోగ్యంగా ఉండడానికి యోగా ఎంతో ఉపకరిస్తుందని, సంపూర్ణ ఆరోగ్య వంతులుగా ఉండాలంటే ప్రతి ఒక్కరు యోగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలను వినియోగించడం వల్ల కలిగే అనర్ధాల గురించి తెలియజేయడమే కాకుండా విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఎన్సిసి, ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్సిసి అధికారి డాక్టర్ పి.వెంకటేశ్వరరావు, ఎన్ఎస్ఎస్ అధికారి ఎం.అనిత, అకడమిక్ కో-ఆర్డినేటర్ డాక్టర్ జె.చిన్నబాబు, ఐక్యూఎసి కో-ఆర్డినేటర్ డాక్టర్ లక్ష్మీ నీలిమతో పాటు అధ్యాపకులు, కార్యాలయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

🕒 22 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/a-grand-yoga-day-at-ramannapet-government-degree-college/article-16833

Tags: