జూనోటిక్ వ్యాధుల నివారణకు టీకాలు కీలకం
విశ్వంభర, నారాయణగూడ : పెంపుడు జంతువులకు సకాలంలో టీకాలు వేయించడం ద్వారా జంతువులతో పాటు మనుషుల ఆరోగ్యాన్నీ రక్షించవచ్చని పశుసంవర్ధక శాఖ అధికారులు, నిపుణులు తెలిపారు. ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా సోమవారం హైదరాబాదులోని నారాయణగూడ ప్రభుత్వ పశువైద్య ఆసుపత్రిలో "పెంపుడు జంతువులకు టీకాలు వేయండి.. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి" అనే నినాదంతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డా. ఆర్. సురేఖ, హైదరాబాదు జిల్లా పశుసంవర్ధక అధికారి (డీవీఏహెచ్‌వో) డా. ప్రవీణ్ కుమార్, ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ లిమిటెడ్ యానిమల్ హెల్త్ ట్రేడ్ వైస్ ప్రెసిడెంట్ ఎస్. శోభన్ బాబు మాట్లాడుతూ పెంపుడు కుక్కలు, పిల్లులు, మేకలు తదితర జంతువులకు రేబిస్‌తో పాటు ఇతర అంటువ్యాధుల నివారణ టీకాలు క్రమం తప్పకుండా వేయించడం ప్రతి యజమాని బాధ్యత అని తెలిపారు. పరిశుభ్రత పాటించడం, సకాలంలో టీకాలు వేయించడం ద్వారా జూనోటిక్ వ్యాధులను సమర్థవంతంగా నివారించవచ్చని వివరించారు. ఈ సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన జంతు ప్రేమికులు తమ పెంపుడు కుక్కలు, పిల్లులు, మేకలకు టీకాలు వేయించుకున్నారు. కార్యక్రమంలో టీకాల ప్రాధాన్యంపై అవగాహన కల్పించడంతో పాటు జంతు సంరక్షణకు సంబంధించిన సూచనలు అందించారు.