15 ఏళ్ల తర్వాత కలిసిన వివేకానంద హైస్కూల్ పూర్వ విద్యార్థులు
విశ్వంభర, శంకర్‌పల్లి : శంకర్‌పల్లిలోని శ్రీ వివేకానంద హైస్కూల్ 2010–2012 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. 15 ఏళ్ల తర్వాత ఒకేచోట చేరిన పూర్వ విద్యార్థులు చిన్ననాటి స్నేహాలను, పాఠశాల రోజుల మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఆనందంగా గడిపారు. ఈ సందర్భంగా తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను కలిసి సత్కరించి వారి ఆశీస్సులు పొందారు. విద్యార్థి దశలో జరిగిన మధుర సంఘటనలను పరస్పరం పంచుకుంటూ పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ప్రస్తుతం వివిధ రంగాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులు తమ అనుభవాలు, విజయాలను ఒకరితో ఒకరు పంచుకున్నారు. స్నేహబంధాలను మరింత బలోపేతం చేసిన ఈ ఆత్మీయ సమ్మేళనం ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. భవిష్యత్తులో కూడా ఇలాంటి సమావేశాలను నిర్వహించాలని పూర్వ విద్యార్థులు నిర్ణయించారు.