ఆరు గ్యారెంటీల అమలుపై ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు కేటీఆర్ సవాల్

ఆరు గ్యారెంటీల అమలుపై ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు కేటీఆర్ సవాల్

  • దాదాపు అన్ని గ్యారెంటీలను అమలు చేశామని బట్టి విక్రమార్క చేసిన ప్రకటనపై మండిపడిన కేటీఆర్
  • దమ్ముంటే ఇదే మాట తెలంగాణలోని ఏదైనా ఒక గ్రామానికి వెళ్లి ప్రజలకు చెప్పాలని సవాల్
  • ఆరు గ్యారంటీల అమలుపైన కాంగ్రెస్ మోసాన్ని ప్రాపగండాను చూసి కాంగ్రెస్ నేతలను గ్రామాల నుంచి తన్ని తరుముతున్నారు
  • బట్టి విక్రమార్కకి, ఆయన క్యాబినెట్ మంత్రులకు దమ్ముంటే ఏదైనా ఒక గ్రామానికి వెళ్లి 6 గ్యారంటీలు అమలు చేశామని చెప్పాలి
  • ఆ గ్రామం నుంచి వీళ్ళని తరిమి వేయకుంటే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా ?  కేటీఆర్

విశ్వంభర,హైదరాబాద్ : భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చేసిన ఆరు గ్యారెంటీలలో దాదాపు అన్ని అమలు చేశామన్న ప్రకటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ, బట్టి విక్రమార్క లాంటి కాంగ్రెస్ నేతలు ఆరు గ్యారెంటీ కార్డులను దాచుకోండి, అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో అన్ని హామీలను నెరవేర్చుతాం” అని ప్రజలను మభ్యపెట్టిన విషయాన్ని గుర్తుచేస్తూ, ఇప్పుడు వంద రోజులు కాదు, రెండు సంవత్సరాలు గడిచిపోయినా ఒక్క హామీని కూడా అమలు చేయని ప్రభుత్వం, దాదాపు అన్నీ చేశామంటూ చెప్పడం ప్రజలను మోసగించడమే” అని కేటీఆర్ మండిపడ్డారు.

ఆరు గారంటీల అమలు విషయంలో, ఇచ్చిన 420 హామీల అమలుపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారం, ప్రోపగండాను చూసి ప్రజలు అసలు నిజం అర్థం చేసుకున్నారని, అందుకే గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులను తరిమేస్తున్నారని కేటీఆర్ అన్నారు.భట్టి విక్రమార్కతో పాటు క్యాబినెట్‌లో ఉన్న ఏ మంత్రి అయినా రాష్ట్రంలోని ఏ గ్రామానికైనా వెళ్లి, మేము అన్ని హామీలు అమలు చేశాం” అని ప్రజల ముందు చెప్పాలని ఆయన సవాలు విసిరారు. దమ్ముంటే చెప్పండి… చెప్పిన తర్వాత ప్రజలు మిమ్మల్ని తరిమి వేయకపోతే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటానని కేటీఆర్ సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు అమలు చేశామని చెబుతున్న అబద్ధాలకు, ప్రోపగండాకు ప్రతి గ్రామంలో ప్రజలే సమాధానం చెప్తారని కేటీఆర్ ధ్వజమెత్తారు.

Read More 'సంక్షోభ కాలం – సామాజిక మార్పు' ప్రజా గ్రంథాలయాల ఆవశ్యకత' అనే అంశాలపై రంగవల్లి స్మారకోపాన్యాసాలు