బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకై ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలి.. BRS పార్టీ మండల శాఖ అధ్యక్షుడు నర్రి నరసింహ

బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకై ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలి..  BRS పార్టీ మండల శాఖ అధ్యక్షుడు నర్రి నరసింహ

విశ్వంభర,సంస్థాన్ నారాయణపురం:సంస్థాన్ నారాయణపురం: రేపు జరగబోయే స్థానిక సంస్థల  ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని బిఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు నర్రి నరసింహ అన్నారు. ఆదివారం నారాయణపురం మండల కేంద్రంలో నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.. అధిష్టానం ఎవరి పేరు ప్రకటించిన వారిని గెలిపించుకోవాలని స్పష్టం చేశారు. ప్రతి కార్యకర్త సైనికుడి లాగా పనిచేసి సర్పంచ్, వార్డు మెంబర్లను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు తెలంగాణ బిక్షం, లారీ బిక్షం, నాయకులు జక్కిడి ధన్వంత్ రెడ్డి, పల్లె గోవర్ధన్ రెడ్డి, మాజీ సర్పంచ్ ఏర్పుల అంజమ్మ, బొడ్డుపల్లి గాలయ్య, జక్కిడి యాదిరెడ్డి, వడ్డేపల్లి రాములు సాగర్, ఉప్పల ఆంజనేయులు, అంతటి భాగ్యలక్ష్మి, రాసాల వెంకటేష్, చిలువేరు బుగ్గ రాములు, చింతకింది ఉష,కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags: