యువ‌త రాజ‌కీయాల్లోకి వ‌చ్చి దేశ ప్ర‌గ‌తికి పాటుప‌డాలి : గ‌వ్వ‌ల భ‌ర‌త్ కుమార్

యువ‌త రాజ‌కీయాల్లోకి వ‌చ్చి దేశ ప్ర‌గ‌తికి పాటుప‌డాలి :  గ‌వ్వ‌ల భ‌ర‌త్ కుమార్

  • అవకాశవాద, వార‌స‌త్వ రాజ‌కీయాల‌తోనే దేశానికే ప్ర‌మాద‌క‌రం
  • ఎన్పీపీ యూత్ ప్రెసిడెంట్, జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీల‌కు ఘనంగా స్వాగ‌తం
  • భ‌ర‌త్ నేతృత్వంలో ర్యాలీ... జాతీయ నాయ‌కుల‌కు భారీ సన్మానం
  • నేష‌న్ పీపుల్స్ పార్టీ ఏపీ, తెలంగాణ కోఆర్డినేట‌ర్ గ‌వ్వ‌ల భ‌ర‌త్ కుమార్

విశ్వంభర, హైద‌రాబాద్ : దేశంలోని యువ‌త రాజ‌కీయాల్లోకి వ‌చ్చి దేశ ప్ర‌గ‌తికి పాటుప‌డాలని నేష‌న్ పీపుల్స్ పార్టీ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల కోఆర్డినేట‌ర్ గ‌వ్వ‌ల భ‌ర‌త్ కుమార్ పిలుపునిచ్చారు. అవకాశవాద, వార‌స‌త్వ రాజ‌కీయాల‌తోనే ఈ దేశానికి ప్ర‌మాద‌క‌రమ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఈ దేశ ప్ర‌గ‌తి కోసం పాటుప‌డే ప్ర‌తి యువ‌తీ యువ‌కుడు రాజ‌కీయాల్లోకి వ‌చ్చి ప్ర‌జా సేవ చేయాల‌ని సూచించారు. నేషనల్ పీపుల్స్ పార్టీ జాతీయ యూత్ ప్రెసిడెంట్ నిక్కీ నాన్గహలా, పార్టీ నేషనల్ సెక్రటరీ(ఆర్గనైజేషన్), అరుణాచ‌ల్ మాజీ హోంశాఖ మంత్రి పక్నా బాగే బుధ‌వారం హైద‌రాబాదులో ప‌ర్య‌టించ‌గా, వారికి గ‌వ్వ‌ల భ‌ర‌త్ నేతృత్వంలో తెలంగాణ‌, ఆంధ‌ప్ర‌దేశ్ పార్టీ నాయ‌కులు ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికారు. పూల‌మాల‌లు, సాంప్ర‌దాయ డ‌ప్పు చ‌ప్పుల్లతో వారికి బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్టు నుంచి బాగ్ లింగం పల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన స‌భ‌కు తీసుకువ‌చ్చారు. ఈ స‌మావేశం గ‌వ్వ‌ల భ‌ర‌త్ నేతృత్వంలో జ‌రిగింది. స‌న్మాన కార్య‌క్ర‌మం ముగిసిన త‌ర్వాత భ‌ర‌త్ స‌భికుల‌ను ఉద్దేశించి మాట్లాడారు. బ‌డుగు, బ‌ల‌హీన‌వ‌వ‌ర్గాల‌కు చెందిన తాను నేడు ఇక్కడ నిలబడి, మన తెలంగాణ భవిష్యత్తును తీర్చిదిద్దే యువతతో మాట్లాడటం త‌న‌కెంతో గర్వంగా ఉంద‌న్నారు. యావత్ దేశవ్యాప్తంగా తిరుగులేని నాయకుడిగా పీ.ఏ. సంగ్మా జాతీయ స్థాయిలో ఎదిగార‌ని, అటువంటి మ‌హ‌నీయుడు పెట్టిన పార్టీకి తాను రెండు తెలుగు రాష్ట్రాల్లో నాయ‌క‌త్వం వ‌హించ‌డం హ‌ర్ష‌ణీయం అన్నారు. మహనీయుడు పీ.ఏ సంగ్మా సేవలను స్మరించడానికి మనమందమున్నార‌ని తెలిపారు. ఆయన గిరిజనులకైనా, బలహీన వర్గాల హక్కుల కోసం జీవితాన్నే అంకితం చేశార‌న్నారు. వాస్త‌వానికి ఈ రోజు అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవమ‌ని, మన సమాజంలోని ప్రతి వ్యక్తి గౌరవంగా, న్యాయమైన హక్కుల కోసం నిలబడే రోజు అని గుర్తు చేశారు. అయితే, ఈ సమానత్వం కేవలం మాటల్లో ఆగిపోవద్దన్నారు. ప్రతి మనిషి హక్కులు సాధించే వరకు… మనమంతా ఉద్యమం చేయాల‌ని అన్నారు. మార్పు తరంగంగా మారాల‌ని సూచించారు. కాగా, ఈరోజు సమానత్వం ఎందుకింత ముఖ్యమయ్యిందంటే, యువతను భవిష్యత్తు నాయకులుగా కాకుండా కేవలం ఓటు బ్యాంకులుగా దేశంలోని అన్ని పార్టీలు చూస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కానీ నేష‌న‌ల్ పీపుల్స్ పార్టీ ఆ దృష్టికోణాన్ని తిరస్కరిస్తున్న‌ట్టు వివ‌రించారు. విద్యా, వైద్య రంగాల్లో ఫీజుల నియంత్రణ, ఉద్యోగులకు సమయానికి రిటైర్మెంట్, ఆరోగ్య ప్రయోజనాలు, అంగ‌న్‌వాడీ, ఆశా వర్కర్లకు రిటైర్మెంట్ భద్రత, పోలీసులకు సముచిత పని గంటలు, రైతులకు అగ్రికేర్ సపోర్ట్ కేంద్రాలు, ప్రభుత్వ ఉద్యోగులకు సమయానికి డీఏ, పీఆర్సీ, మండల స్థాయిలో పేదలకు ఉచిత న్యాయ సలహాల సాయం,  కాంట్రాక్ట్ ఉద్యోగుల భద్రత, ప్రైవేట్ ఉద్యోగుల జీతాలు, పని గంటలు, ఒత్తిడి సమస్యల పరిష్కారం కావాల్సిన అవసరం ఉంద‌న్నారు. WhatsApp Image 2025-12-10 at 6.26.55 PM (1)

మేఘలయ సీఎం కాన్రాడ్ సంగ్మా ఒక గొప్ప నేత :  గవ్వ‌ల భ‌ర‌త్ కుమార్

Read More నష్టపోయిన చేనేత కార్మికులను ఆదుకోండి. 

మనకి ఒక గొప్ప నాయకుడుగా మేఘలయ సీఎం కాన్రాడ్ సంగ్మా దొరికార‌ని నేష‌న్ పీపుల్స్ పార్టీ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల కోఆర్డినేట‌ర్ గ‌వ్వ‌ల భ‌ర‌త్ కుమార్ అన్నారు. ఆయన నిజాయితీ, ధైర్యం, ప్రజల కోసం పనిచేసే మనస్తత్వం మన అందరికీ ఒక గొప్ప ఉదాహరణ అని స్ప‌ష్టం చేశారు. ఎన్నాళ్లుగానో అన్యాయం చూస్తున్నామ‌ని, అయితే నేడు మ‌న భవిష్యత్తు కోసం యువతే లేవాల‌ని అన్నారు. ఇది మేలుకొలుపు... నేషనల్ పీపుల్స్ పార్టీతో కలిసి  న‌డిచి... మనకు నిజమైన రాజకీయాలు, నిజమైన మార్పు, నిజమైన నాయకత్వం ప్రారంభమవుతుంద‌న్నారు. యువత కేంద్రీక్రుత సమాజాన్ని నిర్మిస్తానని హామీ ఇచ్చారు. అయితే, మన చుట్టూ సమస్యలు ఎన్నో ఉన్నాయ‌ని, కానీ వాటిని చెప్పడానికి యువ‌త‌కు ఒక వేదిక లేద‌ని... అయితే, ఆ వేదిక నేష‌న‌ల్ పీపుల్స్ పార్టీ అని గుర్తు చేశారు. మన భవిష్యత్తు మనమే రూపుదిద్దడానికి సిద్ధంగా ఉండాల‌ని... ఎందుకంటే - “లేచి నిలబడే సమయం వచ్చింద‌ని… మన కోసం మనం సమరం చేసే సమయం వ‌చ్చింద‌న్నారు. ఎందుకంటే, ప్రజలు… యువత అన్ని కోణాల్లో ఆలోచించాల‌న్నారు.

Related Posts