ఘోర రోడ్డు ప్రమాదం.. వ్వక్తి స్పాట్ డెడ్

 ఘోర రోడ్డు ప్రమాదం.. వ్వక్తి స్పాట్ డెడ్

విశ్వంభర, మహబూబ్ నగర్ :-  దేవరకద్రలో రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం లారీ, బైక్ ఢీకొన్న ఘటనలో కౌకుంట్ల మండలానికి చెందిన సాలె బలరాజు (35) అక్కడికక్కడే మృతి చెందాడు. కూరగాయల వ్యాపారం చేసుకునే ఆయన, దేవరకద్ర నుంచి కౌకుంట్ల వస్తుండగా ప్రమాదం జరిగింది. మృతునికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags: