పద్మశాలి చేనేత ఆణిముత్యాలు పుస్తకావిష్కరణ. - రవీంద్ర భారతిలో పున్నమి అంజయ్య కు సత్కారం. 

పద్మశాలి చేనేత ఆణిముత్యాలు పుస్తకావిష్కరణ. -   రవీంద్ర భారతిలో పున్నమి అంజయ్య కు సత్కారం. 

  • ప్రశంసించిన బీసీ కమిషన్ మాజీ చైర్మన్ బిఎస్ రాములు. 

విశ్వంభర, హైదరాబాద్ :- (రవీంద్రభారతి) నల్లగొండ జిల్లాకు చెందిన ప్రముఖ కవి రచయిత పున్నమి అంజయ్య రచించిన పద్మశాలి చేనేత ఆణిముత్యాలు పుస్తకావిష్కరణ శనివారం హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో ఘనంగా జరిగింది.తెలంగాణ సాహిత్య అకాడమీ , విశాల సాహిత్య అకాడమీ , తెలంగాణ బాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో పుస్తకావిష్కరణల కార్యక్రమం రవీంద్ర భారతి, మినీ హల్  లో ఘనంగా చేపట్టారు. ఈకార్యక్రమంలో పుస్తకావిష్కర్త ప్రముఖ కధా రచయిత తత్వవేత్త తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ చైర్మన్ బిఎస్ రాములు, తెలంగాణ రాష్ట్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి నామోజు బాలాచారి, ప్రముఖ చరిత్రకారుడు పరిశోధకులు డాక్టర్ సంగిశెట్టి శ్రీనివాస్, ప్రముఖ రచయిత్రి జూపాక సుభద్ర, ప్రముఖ రచయిత్రి జాజుల గౌరీ, అడ్వకేట్ వనం దుష్యంతల ,కర్నాటి మనోహర్ తదితరులు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా బిఏస్ రాములు మాట్లాడుతూ వెనుక బడిన పద్మశాలి చేనేత కులంలోని ఆణిముత్యాల గురించి సాహిత్యం లో మరుగున పడిన మాణిక్యాలను వెలికి తీసి వాళ్ళ చరిత్రను జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు పొందిన చేనేత కళాకారుల గురించి చక్కగా వివరించిన పున్నమి అభినందనీయులని కొనియాడారు. కార్యక్రమ అనంతరం బీసీ కమిషన్ మాజీ చైర్మన్ బిఎస్ రాములు అలాగే పున్నమి అంజయ్య పుస్తకాల అంశాల ప్రస్తవన పై కాసేపు ముచ్చటించారు. ఈ కార్యక్రమానికి వివిధ రచయితలు, సాహితీవేత్తలు, కవులు కళాకారులు పాల్గొన్నారు. 

Tags: