హామీలు అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వానికి గ్రామాల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు

హామీలు అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వానికి గ్రామాల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు

విశ్వంభర మర్పల్లి : అధికార కాంగ్రెస్ పార్టీపై పల్లెల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు. సోమవారం మండలంలోని  కొంశేట్ పల్లి గ్రామాల్లో బీఆర్ఎస్ బలపరి చిన సర్పంచ్ అభ్యర్థి కి మద్దతుగా తిరిగారు. కార్యకర్తలకు దిశ నిర్దేశం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మర్పల్లి మండలం బీఆ ర్ఎస్కు కంచుకోట అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని కల ముందు 420 హామీలు ఇచ్చి ప్రభుత్వం ఏర్పాటయ్యాక మోసం చేసిందన్నారు. పింఛను మొత్తం రూ.4 వేలకు పెంచుతామని మాయ మాటలు చెప్పిందన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతున్నారు. కొంశేట్ పల్లి గ్రామంలో బీఆర్ఎస్ బల పర్చిన అభ్యర్థి మన్నే సుధాకర్ యాదవ్ ను గెలిపించాలని గ్రామస్తులకు కోరారు.  ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు  నాయబ్ గౌడ్ గ్రామ కమిటీ అధ్యక్షుడు వీరేష్ గౌడ్ షాబుద్ధిన్ , మోహీన్ పటేల్ న హిమొదిన్, కంచె ఆనందం విజయ్ కుమార్ తది తరులు పాల్గొన్నారు.

Tags: