ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలి -ఎమ్మెల్యే బాలు నాయక్

ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలి -ఎమ్మెల్యే బాలు నాయక్

విశ్వంభర, చింతపల్లి :-చింతపల్లి మండల కేంద్రానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు మహమ్మద్ సర్వర్, బిఆర్ఎస్ పార్టీ యూత్ కార్యదర్శి ఆంజనేయులుతో పాటు 30 కుటుంబాలు బిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై స్వచ్ఛందంగా కాంగ్రెస్ లోకి చేరుతున్నారు. ప్రజలతో మమేకమై, అభివృద్ధి పథంలో ముందుకు సాగిస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పట్ల విశ్వాసంతో బిఆర్ఎస్, బీజేపీ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయని అన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ప్రజల అభ్యున్నతికి తీసుకుంటున్న నిర్ణయాలు ప్రతి వర్గానికీ మేలు జరుగుతున్నాయి అని తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి ముచ్చర్ల యాదగిరి, మాజీ ఉపసర్పంచ్ సలీం, మాజీ కో ఆప్షన్ మెంబర్ జహంగీర్, మాజీ ఎంపీటీసీ ఎలిమినేటి నర్సింహా, సదానందం, గ్రామ శాఖ అధ్యక్షులు గోవిందు రవి, ఎర్ర జగన్, గోవిందు గిరి, చెట్లపల్లి హరి ప్రసాద్, చాట్ల కిషన్, గూడెల్లి కోటేష్, దాచెపల్లి మధు, ఫయాజ్, ఇంతియాజ్, రియాజ్, యాసీన్ బాబా, జానీ, ఆసిఫ్, గునుకుల నరేష్, కడారి సైదులు, ఆశ్రఫ్, రాకేష్, కంచుకట్ల సాయి తదితరులు పాల్గొన్నారు..

Tags: