సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి-- హనుమకొండ పోలీసులు
On
విశ్వంభర, హనుమకొండ :- FRAUD KA FULL STOP AWARENESS WEEK సందర్భంగా, హనుమకొండ ప్రభుత్వం జూనియర్ కాలేజీలో సైబర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ACP CCPS WGL గిరి కుమార్ ప్రసంగిస్తూ, సైబర్ మోసాలలో గోల్డెన్ అవర్ ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. సైబర్ ఫ్రాడ్ జరిగిన వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1930 కు కాల్ చేయడం, అలాగే cybercrime.gov.in లో లేదా TGCSB వెబ్‌సైట్ లోని చాట్‌బాట్ ద్వారా వెంటనే ఫిర్యాదు చేయాలని ప్రజలందరూ సైబర్ క్రైమ్ మీద అవగాహన కలిగి ఉండాలని ఇకపై సైబర్ క్రైమ్ జరగకుండా స్టాప్ చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో హన్మకొండ ఇన్స్పెక్టర్ మచ్చ శివకుమార్ CCS ఇన్‌స్పెక్టర్ గోపి , సైబర్ క్రైమ్స్ CI అశోక్ , SI శివకుమార్ , స్టాఫ్ సభ్యులు, కాలేజీ ప్రిన్సిపల్ శ్రీనివాస్ అలాగే దాదాపు 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు



