పర్వేద నర్సింహులు భారీ విజయం ఖాయం.
On
విశ్వంభర, షాబాద్:- మండల పరిధిలోని ముద్దేం గూడా గ్రామంలో గడపగడపకు ప్రచారం నిర్వహించిన టిఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి పర్వేద నర్సింలు ప్రచారంలో భాగంగా గ్రామంలో ప్రతి గడపకు తిరుగుతూ కత్తెర గుర్తుకు ఓటేయాలని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. ముఖ్యంగా మహిళలు యువకులు, పెద్దలు అందరు కూడా గ్రామంలో సుమారు మూడు వందల మందితో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు జయమ్మ దర్శన్, భూపతి రాజు మాజీ ఎంపీపీ కూర వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు



