సర్పంచ్ గా గెలిపిస్తే మోడల్ గ్రామపంచాయతీగా తీర్చిదిద్దుతా* కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి

సర్పంచ్ గా గెలిపిస్తే మోడల్ గ్రామపంచాయతీగా తీర్చిదిద్దుతా*  కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి

విశ్వంభర, సంస్థాన్ నారాయణపురం: సర్పంచ్ గా గెలిపిస్తే మోడల్ గ్రామపంచాయతీగా సంస్థాన్ నారాయణపురం గ్రామాన్ని తీర్చిదిద్దుతానని సిపిఐ బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి అన్నారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గత సర్పంచ్ ఎన్నికలలో అధికార దృక్పధంతో నన్ను ఓడించి విజయాన్ని పొందారు.ఆరు సంవత్సరాల నుండి నేను ఓడిపోయిన కానీ గ్రామ అభివృద్ధికి నా సహాయ సహకారాలు చేసుకుంటూ ప్రజల బాగోగులను చూసుకుంటూ ముందుకు సాగుతున్నాను.ఏనాడు కూడా గ్రామ ప్రజల కోసం వెనకడుగు వేయకుండా ప్రతినిత్యం ప్రజల మధ్యనే ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ వచ్చాను, అత్యవసర పరిస్థితులలో అనారోగ్యాలకు గురై ఇబ్బందులు పడుతున్న వారికి ఆంబులెన్స్ సౌకర్యాన్ని నిరుపేదలకు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ మీ అందరి వాడిగా ఉంటూ ముందుకు సాగుతున్నాను. ఆరు సంవత్సరాల తర్వాత మళ్లీ తిరిగి స్థానిక సంస్థల ఎన్నికలు రావడంతో సిపిఐ పార్టీ బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి బరిలో నిలబడడం జరిగింది.ఇతర పార్టీ నాయకులు మభ్యపెడుతూ డబ్బుకు లొంగ తీసుకొని ఓటు వేయాలని చెప్పి వారి మాటలు నమ్మకుండా అధికారంలో ఉన్న అభివృద్ధి కావాలన్నా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకుంటే గ్రామ అభివృద్ధికి గ్రామానికి మంచి పేరు లభిస్తుందని అన్నారు. గ్రామాలలో ఎలాంటి సమస్యలు ఉన్న తీర్చడానికి నేను ముందుంటానన్నారు. ముఖ్యంగా కోతులు కుక్కలు బెడదతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు మొదటి సమస్య పరిష్కారం చేయడానికి నా వంతుగా కృషి చేస్తానని పేర్కొన్నారు, యువకులకు క్రీడా మైదానాన్ని అలాగే జిమ్ కూడా ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు.పార్టీలు పక్కనపెట్టి మీ అందరి కోసం నేను పని చేస్తాను.ఈసారి నాకు ఒక్క అవకాశం ఇచ్చి నన్ను సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఉమా ప్రేమ్చందర్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ జక్కడి జంగారెడ్డి కాంగ్రెస్ నాయకులు మందుగుల బాలకృష్ణ, జక్కడి చంద్రారెడ్డి, కోన్ రెడ్డి నరసింహ, సిపిఐ శాఖ సెక్రెటరీ పల్లె మల్లారెడ్డి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Tags: