42 శాతం బి.సి రిజర్వేషన్ల అమలుకు - ఆత్మగౌరవ - ధర్మపోరాట ర్యాలీలో గర్జించిన బి.సి.లు

42 శాతం బి.సి రిజర్వేషన్ల అమలుకు - ఆత్మగౌరవ - ధర్మపోరాట ర్యాలీలో గర్జించిన బి.సి.లు

  • # రిజర్వేషన్ల కేటాయింపులలో - తప్పులు జరిగాయన్న బి.సి కమిషన్ మాటను వినరా?
  • # బి.సి.లకు అన్యాయం చేయడమే మీ నైజమా ... ఆర్. కృష్ణయ్య
  • #  బి.సి.ల ఆత్మ గౌరవ, ధర్మ పోరాట ప్రదర్శనలో విరుచుకుపడ్డ...ఆర్. కృష్ణయ్య
  • # బి.సి.లకు అన్యాయం చేస్తూనే - మేమే రోల్ మోడల్ అని ప్రభుత్వం చెప్పుకోవడం సిగ్గు చేటు
  • # చిత్తశుద్ధి ఉంటే అఖిలపక్ష ప్రతినిధి బృందాన్ని - న్యూ డిల్లీ తీసుకొని వెళ్లి ప్రధానమంత్రిని కలపండి.
  • # తప్పులు అన్ని మీదగ్గర పెట్టుకొని - కేంద్రాన్ని విమర్శించడం బట్టకాల్చి మీద వేయడం కాదా?
  • # రిజర్వేషన్ల సాధనకు న్యూ డిల్లీ AICC ఆఫీసు ముందు ధర్నా చేపడతాం.
  • # 42 శాతం రిజర్వేషన్ల అమలు బాధ్యత రాహుల్ గాంధీదే.  

విశ్వంభర, హైదరాబాద్ :- బి.సి రిజర్వేషన్లలను తగ్గించి మోసం చేస్తూనే, మా ప్రభుత్వం దేశానికీ ఆదర్శం అని చెప్పుకోవడం సిగ్గు చేటు, నయవంచన అని రాజ్యసభ సభ్యులు, జాతీయ బి.సి సంక్షేమ సంఘ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య తీవ్రంగా విమర్శించారు. ఒక వైపు బి.సి రిజర్వేషన్లల కేటాయింపులలో అవకతవకలు జరిగాయని, రిజర్వేషన్ల శాతం తగ్గిందని, అందుకే వెంటనే  ఎన్నికలు వాయిదా వేసి సరిదిద్దాలని రాష్ట్ర బి.సి కమిషన్ తెలిపినప్పటికీ ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం పడ్డ చందంగా  వ్యవహరించడం అప్రజాస్వామికం. ఇది రేవంత్ ప్రభుత్వ నియంతృత్వ పోకడకు నిదర్శనం అని అయన ధ్వజమెత్తారు. 
సోమవారం నాడు నగరంలోని ఇందిరాపార్క్ నుండి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు బి.సి.ల ఆత్మ గౌరవ –ధర్మ పోరాట ర్యాలీ ని భారీఎత్తున్న నిర్వహించారు. ఈ ర్యాలీ లో సంఘిభావంగా BRS శాసనమండలి పక్ష నాయకులూ సిరికొండ మధుసూధనా చారి,రాష్ట్ర బి.సి కమిషన్ మాజీ చైర్మన్ డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు, BJP OBC మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ గౌడ్, బి.సి సంక్షేమ సంఘం జాతీయ కో ఆర్డినేటర్ ర్యాగ రిషి అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రదర్శనకు పెద్ద ఎత్తున తరలివచ్చిన బి.సి. కుల, విద్యార్ధి, మహిళా, యువజన, ఉద్యోగ సంఘాలు, మేధావులు, వివిధ రాజకీయ పార్టీ నాయకులూ పాల్గొన్నారు. ఈ ప్రదర్శనకు బి.సి యువజన సంఘ రాష్ట్ర అధ్యక్షులు జిల్లపల్లి అంజి, బి.సి విద్యార్ధి సంఘ రాష్ట్ర కన్వీనర్ మోడీ రాందేవ్ లు నాయకత్వం వహించారు.    ఈ సందర్భంగా ఆర్. కృష్ణయ్య ప్రసంగిస్తూ ప్రభుత్వం వెంటనే ఎన్నికలను వాయిదావేసి, 42% బిసి రిజర్వేషన్‌ల అమలుకు చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. రేవంత్‌ ప్రభుత్వం బిసిల ఆత్మగౌరవానికి, మనోభావాలకు భంగం కలిగిస్తూ, ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతుందని ఆయన మండిపడ్డారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేని ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. ఇది బిసిలకు మోసం, దగా, నయవంచన చేయడమేనని ఆయన విమర్శించారు. ప్రజల ఆత్మగౌరవానికి భంగం కలిగినప్పుడు శ్రీలంక, బంగ్లాదేశ్‌, నేపాల్ లాంటి పలు దేశాలలో ఏం జరిగిందో రేవంత్‌ ప్రభుత్వం గమనంలో ఉంచుకోవాలని కృష్ణయ్య హితవు పలికారు.  మొదటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు అన్ని అనుమాదాస్పదంగా ఉన్నాయన్నారు. అసెంబ్లీ తీర్మానం చేసిన తర్వాత అఖిలపక్షాన్ని ప్రధానమంత్రిని కలవడానికి తీసుకు వెళ్ళలేదు. లోక్ సభలో ఇండియా కూటమికి 236 మంది ఎంపీలు ఉన్నారు. గత పార్లమెంటు సమావేశాలు బీహార్ ఓటర్ల విషయంలో నెల రోజులు పార్లమెంట్ బహిష్కరించారు. కానీ బీసీల విషయంలో ఒక్కరోజు కూడా ప్రస్తావించలేదు. బహిష్కరించలేదు కనీసం మాట్లాడలేదు. పోనీ కనీసం చిత్తశుద్ధి ఉంటే ప్రైవేటు బిల్లు ఎందుకు పెట్టలేదు. ఇదేనా అమలు చేసే విధానం. ప్రతి దశలో కాంగ్రెస్ ప్రభుత్వానికి 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలనే చిత్తశుద్ధి లేదని తేట తెల్లం అవుతుందని కృష్ణయ్య అన్నారు. కాంగ్రెస్ అంటే మోసం అనేది ప్రజలకు తెలిసిపోయిందని అన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక రెండేళ్లు డ్రామా నడిపి, ఇప్పుడు ఇవ్వలేమని చేతులు ఎత్తివేయడం దుర్మార్గమని విమర్శించారు.సిరికొండ మధుసూధనా చారి ప్రసంగిస్తూ....42 శాతం రిజర్వేషన్ల ఉద్యమానికి పూర్తి మద్దతును ప్రకటించారు. ప్రభుత్వం తన వైఖరిని మార్చుకొని, 42 శాతం అమలుకు వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర బిసి కమిషన్‌ మాజీ ఛైర్మన్‌ డా|| వకుళాభరణం కృష్ణమోహన్‌రావు ప్రసంగిస్తూ.... చట్టసభలను, హైకోర్టును, ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ, రేవంత్‌ ప్రభుత్వం నియంతృత్వ వైఖరితో పాలన కొనసాగిస్తున్నదని ఆయన ఆరోపించారు. ప్రజాపాలన కొనసాగిస్తున్నామని గొప్పలు చెప్పుకునే రాష్ట్రప్రభుత్వం మెజారిటీ బిసి వర్గాల ప్రయోజనాలను కాలరాయడమే ప్రజారంజకమా? అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం చేపట్టిన సిపెక్ సర్వే తో బి.సి రిజర్వేషన్ల శాతం తగ్గిందన్నారు. దీనితో తాము మొదటి నుండి చెప్పిందే నిజమైందన్నారు. తప్పులమయం అయిన సర్వే డేటా ఆధారంగా కాకుండా ప్రత్యేక కమిషన్ వేసి నిజమైన డేటా ద్వారా బి.సి రిజర్వేషన్ల శాతంను నిర్ణయించాలని అయన డిమాండ్ చేశారు.  బిసి సంక్షేమ సంఘం జాతీయ కోఆర్డినేటర్‌ డా|| ర్యాగ రుషి అరుణ్‌కుమార్‌ ప్రసంగిస్తూ.... ప్రభుత్వం ప్రజలకు మేలు చేయాల్సిందిపోయి రహస్య ఎజెండాలతో కీడుచేసే పనులను చేపడుతున్నదని ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్యం అంటే ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం, అందుకు అనుగుణంగా పాలన కొనసాగించడం. కానీ రేవంత్‌ప్రభుత్వం అందుకు భిన్నంగా ప్రజాస్వామ్య స్ఫూర్తిని అపహాస్యం చేస్తుందని ఆయన విమర్శించారు.ఈ భారీ ప్రదర్శనలో నీల వెంకటేష్, గుజ్జ సత్యం, అనంతయ్య, బాణాల అజయ్, భీం రాజ్, రాజ్ కుఉమార్, వేణుమాధవ్, ఆశిష్ గౌడ్, నిఖిల్ పటేల్, బాల స్వామి తదితరులు పాల్గొన్నారు.

Tags: