చేనేత ఐక్యవేదిక ఆర్గనైజింగ్ సెక్రటరీ గా సిరిమల్ల పద్మ నియామకం
On
విశ్వంభర, హైదరాబాద్ ; గ్రేటర్ హైదరాబాద్ చేనేత ఐక్య వేదిక ఆర్గనైజింగ్ సెక్రటరీ గా సిరిమల్ల పద్మ నియామకమయ్యారు. ఈ నియామక పత్రాన్ని తుర్కయంజాల్ లోని చేనేత ఐక్య వేదిక రాష్ట్ర కార్యాలయం లో రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీర మోహన్ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్బంగా రాపోలు వీరమోహన్ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వెళ్లేవిధంగా అటు సమాజం లో ఇటు సామాజిక వర్గంలో ఆర్ధిక , రాజకీయ , సామాజికంగా ఎదిగేలా చేనేత ఐక్యవేదిక ప్రోత్సహిస్తుందని వారు అన్నారు. నేటి నుండి చేనేత కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాటం చేయాలనీ వారు అన్నారు. నియామకం అయిన సిరిమల్ల పద్మ మాట్లాడుతూ నాపై ఎంతో నమ్మకం ఉంచి మహిళా నాయకురాలిగా నన్ను తీర్చిదిద్దడానికి మొదటి అడుగు వేపించిన అధ్యక్షులు రాపోలు వీర మోహన్ కు ధన్యవాదాలు తెలిపారు. అలాగే మహిళా అభ్యున్నతికి , సాధికారతకు , చేనేత మహిళల సంక్షేమం కోసం నిరంతరం పోరాటం చేస్తానని అన్నారు. నా ఎంపిక కు సహకరించిన ప్రతిఒక్కరికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. తక్షణమే ఈ నియామకం అమలు లోకి వస్తుందని , పద్మశాలి జాతి శ్రేయస్సు కోసం, చేనేత వృత్తి పరిరక్షణకు మరియు వివిధ వృత్తులలో వున్న పద్మ కులభాంధవుల శ్రేయస్సు కోసం సంక్షేమము కోసం మీరు అవిరళ కృషి చేయాలని చేస్తారని ఆశిస్తూ మీకు హృదయపూర్వక అభినందనలు రాపోలు తెలిపారు.



