ఘనంగా నేషనల్ డాక్టర్స్ క్రికెట్ టోర్నమెంట్ ముగింపు వేడుకలు
విశ్వంభర, హైదరాబాద్:- గత ఐదు సంవత్సరాలుగా నిర్వహిస్తున్న నేషనల్ డాక్టర్స్ క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమం హైదరాబాద్ లోని ప్రముఖ హోటల్లో ఘనంగా పెస్ హాస్పిటల్ ఆర్థోపెడిక్ డాక్టర్ ఆనంద్ ఆగ్రోయ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాయింట్ కమిషనర్ జిఎస్టి కౌన్సిల్ వై శ్రీ లీల, ఎమ్మెస్ కే ప్రసాద్ మాజీ ఇండియన్ టీం క్రికెట్ ప్లేయర్, దీక్ష ఆంధ్రప్రదేశ్ క్రికెటర్, పాల్గొని గత ఐదేళ్లుగా విజయవంతంగా నేషనల్ డాక్టర్స్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్న వారికి అభినందనలు తెలియజేశారు, మహిళ మనోధర్యం పెంచుతూ, అన్ని రంగాల్లో మహిళలు రాణించాలని పలు సూచనలు ఇచ్చారు, వైద్య సేవలో రాణిస్తూ పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఆరోగ్యం పైన అవగాహన కనిపిస్తూ పలు క్రీడా కార్యక్రమాల నిర్వహిస్తు ఆరోగ్యం పైన అవగాహన కల్పిస్తూ 150 మంది డాక్టర్లు 12 టీములు, ఇండియా వైడ్ గా పాల్గొన డాక్టర్స్ అందరికీ విజయవంతంగా విజేతలుగా నిలిచిన వారిని, ఘనంగా సన్మానించారు సందర్భంగా ఆర్థోపెడిషన్ ఆనంద్ ఆగ్రోయ,,మాట్లాడుతూ, మైనర్ బాలికలపై జరిగే దాడులను అమ్మాయిలకు తమ ఆత్మ రక్షణ పై అవగాహన కల్పిస్తూ వారి ఆరోగ్యం పై అవగాహన పెరిగే విధంగా ఈ టోర్నమెంట్ ద్వారా తన ప్రయత్నాన్ని విజయవంతం చేసినందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు మరింత బాధ్యతను పెంచిందన్నారు,సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలిపారు.



