డా. వేదాల శ్రీనివాస్ కు విఎంపి భారత గౌరవ పురస్కారం
విశ్వంభర, హైదరాబాద్ :- జాతీయ మానవ హక్కుల దినోత్సవ సమావేశంలో డా. వేదాల శ్రీనివాస్ (హానరరీ)కి విఎంపి భారత గౌరవ పురస్కారం విశ్వ మానవాధికార పరిషత్ (విఎంపి) అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం 77వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ సదస్సు & అవార్డు కార్యక్రమం – 2025 ను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించింది.డిసెంబరు 10, 2025న ఛత్రపతి శంభాజీనగర్, ఔరంగాబాద్, మహారాష్ట్ర లో జరిగిన ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు, రక్షణ విభాగానికి చెందిన అధికారులు, విధాన నిర్ణేతలు మరియు సామాజిక రంగ నాయకులు హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌కు చెందిన డా. వేదాల శ్రీనివాస్ (హానరరీ)కి VMP భారత గౌరవ అవార్డు-2025 ప్రధానం చేసారు. సమాజ శ్రేయస్సు కోసం ఆయన నిరంతరం చేస్తున్న కృషి, మానవతా విలువలను పెంపొందించడంలో ఆయన పాత్ర విశేషమని నిర్వాహకులు పేర్కొన్నారు.ఈ అవార్డు ప్రధాన అతిథులైన కల్నల్ నిర్దేష్ షా, లెఫ్టినెంట్ కల్నల్ అమిత్ ప్రభు, వారి బెటాలియన్ సిఓ 136 టిఎ ఎకో బి ఎన్ మహర్ సమక్షంలో ప్రదానం చేయబడింది. అలాగే డాక్టర్. ఎం. ఆర్. అన్సారీ (అడ్వకేట్, జాతీయ అధ్యక్షులు – డబ్ల్యు హెచ్ ఆర్ సి ), గౌ. హాజీ సయ్యద్ లయేక్ (జాతీయ ఉపాధ్యక్షులు – ), అడ్వకేట్. జ్యోతి తోష్నీవాల్–మాలు (మహారాష్ట్ర రాష్ట్రాధ్యక్షులు – డబ్ల్యు హెచ్ ఆర్ సి) తదితర జాతీయ మరియు రాష్ట్ర స్థాయి అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా స్పందించిన డాక్టర్. వేదాల శ్రీనివాస్ (హానరరీ) గారు అవార్డు అందించిన వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తాను ఎంతో ప్రేరణగా భావిస్తున్నానని, సామాజిక సేవ, సమాజ అభివృద్ధి, ఆధ్యాత్మిక సేవల్లో తన కృషి కొనసాగుతుందని పేర్కొన్నారు.మానవతా కార్యక్రమాలతో పాటు, డాక్టర్. వేదాల శ్రీనివాస్ (హానరరీ) గారు ప్రముఖ క్లైర్‌వాయంట్, సినీ నిర్మాతగా మరియు మర్చెంట్ ఎక్స్‌పోర్టర్ కూడా విశేష గుర్తింపు పొందారు.



