శ్రీశ్రీశ్రీ బంగారు మైసమ్మ దేవాలయం హనుమాన్ నగర్ ఫేస్ -3 లో బోర్ వెల్ పనులు ప్రారంభోత్సవం
On
విశ్వంబర/ గౌలిపుర :- గౌలిపుర డివిజన్లోని హనుమాన్ నగర్ ఫేస్-3 లోని బంగారు మైసమ్మ దేవాలయ ప్రాంగణంలో గౌలిపుర కార్పొరేటర్ ఆలే భాగ్యలక్ష్మి దేవాలయ ప్రాంగణంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించి ఈరోజు ఉదయం 11 గంటలకు బోర్వెల్ పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ ప్రెసిడెంట్ రావుల నరేందర్ మాట్లాడుతూ కార్పొరేటర్ గారు ఈ యొక్క బోర్ పనులు ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని బోనాల సందర్భంలో ప్రజలు చాలా ఇబ్బందులు పడేవారని ఇబ్బందులు గమనించి ఈ యొక్క కార్యక్రమం చేయడం శుభదాయకమని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రెటరీ యాదగిరి చారి, ట్రెజరర్ నాగరాజు గుప్తా, విశ్వేశ్వరప్ప, మోహన్ రావు,డీసీఎం మహేష్ శివకుమార్ మరియు బిజెపి సీనియర్ నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.



