ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం ప్రారంభం

ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం ప్రారంభం

విశ్వంభర, వరంగల్  :- వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజ్ బొల్లికుంటలో AICTE స్పాన్సర్డ్ ATAL ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం ప్రారంభించారు. ఈ ప్రోగ్రాం ద్వారా ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్  క్లౌడ్ కంప్యూటింగ్ లొ కొత్త పరిశోదనా  అధ్యయన మెలుకువలను అధ్యాపకులు నేర్చుకుంటారని ప్రోగ్రాం కోఆర్డినేటర్ డా. కల్యాణపు శ్రీనివాస్ తెలిపారు. ముఖ్య అతిధిగా పాల్గొన్న డా. వినయ్ రాజ్ మాట్లాడుతూ ప్రస్తుతం AI అన్ని రంగాలను ఏవిధంగా ప్రభావితం చేస్తుంది ముఖ్యంగా విద్యారంగంలొ AI వాడకం గురించి వివరించారు ఈ సదస్సు నిర్వాహకులు కో-కోఆర్డినేటర్ కాత రంజిత్ కుమార్, ప్రొఫెసర్ కే షర్మిల, ప్రొఫెసర్ రేఖా గంగుల, ప్రొఫెసర్ మనోహర్, ప్రొఫెసర్ శివశంకర్, ప్రొఫెసర్ సయ్యద్ ముస్తక్ అహ్మద్, ప్రిన్సిపాల్ డా. M శశిధర్ మరియు వివిధ కళాశాలల అధ్యాపకులు పాల్గొన్నారు

Tags: