సూర్యాపేట ఆసుపత్రిలో వింత నిబంధన.. ‘సపరేటా’?

సూర్యాపేట ఆసుపత్రిలో వింత నిబంధన.. ‘సపరేటా’?

  •  సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రి: వైద్యులను కలవాలంటే ‘పర్మిషన్’! - 
  • సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రి రూటే సపరేటు
  • ఎన్నడూ లేని విధంగా ఇష్టరాజ్యంగా కొత్త నిబంధన  
  • ముక్కు మీద వేలు వేసుకుంటున్న ఆస్పత్రికి వచ్చే రోగులు

విశ్వంభర, సూర్యాపేట :-  జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి తీరే సపరేట్ అన్నట్లుగా ఆస్పత్రి వ్యవహారం ఉందని ఆసుపత్రికి వచ్చే రోగులు పలువురు ఆరోపిస్తున్నారు....పై ఫ్లోర్ కు వెళ్ళి  RMO, సూపర్డెంట్, ఇతర వారిని కలవాలంటే ముందుగా పర్మిషన్ తీసుకోవాలని ఒక టేబుల్ ఏర్పాటు చేసి ఇద్దరు వర్కర్లను అక్కడ ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కనీసం వైద్యులను కలిసే అర్హత కూడా లేకుండా పోతుందని ఇదెక్కడి న్యాయం అంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విధులకు ఎవరైనా  డుమ్మా కొడుతున్నారా? అనేది తెలియ రావడంలేదని ప్రజల నుండి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలే రాష్ట్రంలో ఎక్కడా లేని ఈ ప్రైవేట్ తరహా నియమాలు పెట్టడం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.ఇప్పటికైనా సొంత నిర్ణయాలు మార్చుకొని ప్రజా ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా రోగులకు మెరుగైన సేవలు అందించాలని  ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కలెక్టర్ జోక్యం చేసుకోవాలి ఆసుపత్రి తీరుపై కలెక్టర్ తేజస్ జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Tags: