సర్పంచ్ ఎన్నికలలో యువకుల జోరు
విశ్వంభర/ మహబూబ్ నగర్ జిల్లా కౌకుంట్ల మండలం :-కౌకుంట్ల మండల కేంద్రం లో 12 గ్రామపంచాయతీలు, 106 వార్డులకు రెండో దశలో నిర్వహించే ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ ల స్వీకరణ పర్వం రెండో రోజైన సోమవారం రాత్రి వరకు కొనసాగింది. వాస్తవానికి నామినేషన్ల దాఖలు చేసేందుకు సాయంత్రం పెద్ద సంఖ్యలో వచ్చారు. దీంతో ఐదు గంటల వరకు వచ్చిన వారందరి నుంచి స్వీకరించాలని నిర్ణయించారు.ఈ ప్రక్రియ పూర్తి అయ్యేసరికి బాగా రాత్రి అయ్యింది. సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు, పార్టీల మద్దతుదారులు భారీ సంఖ్యలో దాఖలు చేశారు. ఈ సందర్భంగా సోమవారం ఉదయం నుండి మండలంలోని క్లస్టర్ కార్యాలయానికి అభ్యర్థులు తరలివచ్చి సందడి వాతావరణాన్ని నెలకొల్పారు. అధికారుల పర్యవేక్షణలో పారదర్శకంగా నామినేషన్లు స్వీకరించగా కౌకుంట్ల మండల పరిధిలోని అప్పంపల్లి 02 సర్పంచ్,19 వార్డు సభ్యులు, కౌకుంట్ల 06 సర్పంచ్,24 వార్డు సభ్యులు, పుట్టపల్లి 01 సర్పంచ్,09 వార్డు సభ్యులు, రేకులంపల్లి 06 సర్పంచ్,05 వార్డు సభ్యులు, వెంకటగిరి 03 సర్పంచ్,05 వార్డు సభ్యులు, దాసర్ పల్లి 03 సర్పంచ్, వార్డు సభ్యులు 14, ముచ్చింతల 03 సర్పంచ్,10 వార్డు సభ్యులు, తిరుమలాపూర్ 05 సర్పంచ్, ఇస్రాంపల్లి 01 సర్పంచ్,11 వార్డు సభ్యులకు నామినేషన్లు స్వీకరించారు. మొత్తం కలిపి రెండో రోజు సర్పంచ్ 30 వార్డు నెంబర్లు 97 నామినేషన్లు దాఖలు అయ్యాయని అధికారులు తెలిపారు.



