సైబర్ నేరాలపై అవగాహన సదస్సు
On
విశ్వంభర, సంతోష్ నగర్ ;- యువత విద్యార్థులను సైబర్ మోసాల నుంచి కాపాడేందుకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సంతోష్ నగర్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ తెలిపారు. మంగళవారం సంతోష్ నగర్ లోని హీదాయ జూనియర్ కాలేజీలో ప్రత్యేక సైబర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సైబర్ మోసాల పడిన 1930కు కాల్ చేయాలని విద్యార్థులకు సూచించారు. వాట్సాప్, ఎస్ఎంఎస్, టెలిగ్రామ్ ద్వారా వచ్చే అనుమానస్పద లింకులపై క్లిక్ చేయొద్దని తెలియని యాప్లు /APK లు ఇన్స్టాల్ చేస్తే వెంటనే తొలగించాలని అనుమానస్పద గ్రూపులు కనిపిస్తే వెంటనే తొలగించాలని సూచించారు.



