ఫోక్సో కేసులో నిందితుడికి 6 ఏళ్ల కఠిన కారాగార శిక్ష
On
విశ్వంభర, సంతోష్ నగర్:- ఫోక్సు చట్టం కింద నమోదైన ఒక కీలక బాధిత కుటుంబానికి న్యాయం లభించింది. 2022లో నమోదు చేసిన కేసులు దోషిగా తేలిన నిందితుడికి నాంపల్లి కోర్టు కఠిన శిక్ష విధించింది. నాంపల్లి హానరబుల్12వ అదనపు సెషన్స్ జడ్జి టి అనిత వెలువరించిన తీర్పు ప్రకారం హైదరాబాద్ మోయిన్ బాగ్ రవుఫ్ నగర్ కు చెందిన ఫజల్ -ఇ -అలం -కైఫీ అలియాస్ మహమ్మద్ ఫజల్ అలియాస్ మొబిన్ (38) పై ఫోక్స్ కేసు నమోదు అయింది. ఈ క్రమంలో పోలీసులు దర్యాప్తు సాక్షాదారుల ఆధారంగా సమర్పణతో నేరం నిరూపితమైందని ఇన్స్పెక్టర్ సత్యనారాయణ తెలిపారు. నిందితుడికి ఆరేండ్ల జైలు శిక్షతోపాటు పదివేల రూపాయల జరిమానా, జరిమాన చెల్లించకుంటే అదనంగా మరో మూడు నెలలు జైలు శిక్ష అనుభవించ వలసి వస్తుందని జడ్జి అనిత తీర్పునిచ్చారు.



