తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కారకుడైన
ఈ రోజు చైతన్యపురి డివిజన్ అధ్యక్షుడు తోట మహేష్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన దీక్ష విజయ్ దివస్ కార్యక్రమం
On
విశ్వంభర చైతన్యపురి:-తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కారకుడైన తెలంగాణ ఉద్యమ యోధుడు, తెలంగాణ జాతిపిత కెసిఆర్ గారి ఉద్యమ ఫలితంగా బంగారు తెలంగాణకు ఊపిరి పోసిన దీక్ష విజయ్ దివస్ సందర్బంగా ఈరోజు చైతన్యపురి డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తోట మహేష్ యాదవ్ ఆధ్వర్యంలో చైతన్యపురి మాజీ కార్పొరేటర్ విట్టల్ రెడ్డి ఆఫీస్ దగ్గర చైతన్యపురి బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులతో కలిసి కెసిఆర్ గారి చిత్రపటానికి మరియు తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, పవన్, గట్టు శ్రీను, రమణారెడ్డి,ప్రవీణ్ చారీ, ఇందర్,ఆర్కే, వీరన్న యాదవ్, జలంధర్, పాండు,పులి కిరణ్ తదితరులు పాల్గొనడం జరిగింది.



