ప్రాణం ఉన్నంతవరకు నిరుపేదలకు సేవ చేస్తాం.- -డా. కోడి శ్రీనివాసులు

 ప్రాణం ఉన్నంతవరకు నిరుపేదలకు సేవ చేస్తాం.-  -డా.  కోడి శ్రీనివాసులు

  •  నిరుపేదల కండ్లల్లో ఆనందం చూడడమే గాంధీజీ ఫౌండేషన్ ఆశయం  
  • గాంధీజీ ఫౌండేషన్ వారి 24వ నెల సరుకుల పంపిణీ
  • ఏ ఆసరా లేని నిరుపేదలను ఆదుకోవడమే గాంధీజీ ఫౌండేషన్ ఆశయం   
  •  రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న నిరుపేదలకు నిత్యవసర సరుకులు పంపిణీ కార్యక్రమం 

విశ్వంభర, చండూర్:- రెండు సంవత్సరముల వరకు ప్రతినెల 30 మంది నిరుపేదలకు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల విలువ చేసే నిత్యావసర సరుకుల పంపిణీ చేయాలనే లక్ష్యంతో ట్రస్మా జిల్లా అధ్యక్షుడు, గాంధీజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాస్ దంపతులు 2024వ సంవత్సరం జనవరి నెల ఒకటో తేదీన ప్రారంభించిన గాంధీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో "నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ" కార్యక్రమం సోమవారం నాడు స్ధానిక గాంధీజీ విద్యాసంస్థల యందు  24వ నెల నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం జరిగింది. వీళ్ళందరికీ రెండు సంవత్సరములు నిత్యావసర  సరుకులు ఇస్తామని గతంలో చెప్పిన ప్రకారంగా ఈరోజుతో రెండు సంవత్సరములు పూర్తయినది కానీ, ఈ 30 మంది నిరుపేదలు ఇంకా కొంతకాలం మాకు నిత్యవసర సరుకులు ఇవ్వాలని డాక్టర్ కోడి శ్రీనివాసులకు కోరగా మరో ఆరు నెలలు ఈ సరుకుల పంపిణీ మీకు అందజేస్తానని తెలియజేశారు.ఈ సందర్భంగా గాంధీజీ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు  మాట్లాడుతూ మా జీవితం ఉన్నంతవరకు గాంధీజీ ఫౌండేషన్ ద్వారా నిరుపేదలకు ఉచిత నిత్యావసర సరుకుల పంపిణీ తో పాటు మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ, సమాజంలో ఆదర్శవంతంగా జీవిస్తామని,  నిత్యావసర సరుకులు అందుకుంటున్న పేదలు మీరిచ్చే సరుకులు నెల రోజులు సరిపోతున్నాయని, ఆ సరుకులతో వంటలు చేసుకుని తింటూ, ఆరోగ్యంగా జీవిస్తున్నామని ఆనందభాష్పాలతో తెలియజేస్తున్నారని, నిరుపేదల కండ్లల్లో ఆనందాన్ని చూడడమే గాంధీజీ ఫౌండేషన్ లక్ష్యమని అన్నారు. గాంధీజీ ఫౌండేషన్ పేదల పక్షపాతి అని, ప్రాణం ఉన్నంతవరకు నిరుపేదలకు సేవ చేస్తూనే ఉంటామని అన్నారు.  ఈ కార్యక్రమంలో  గాంధీజీ విద్యాసంస్థల డైరెక్టర్ సరికొండ వెంకన్న, ప్రిన్సిపాల్ భార్గవ్, పులిపాటి రాధిక, కందుల కృష్ణయ్య, పాలకూరి కిరణ్, ఆనంద్, నజీర్, వెంకటేశ్వర్లు, యాలాద్రి, కోటేష్, బోడ యాదయ్య, వెంకన్న, బోడ సాయిరామ్, ప్రేమ్ కుమార్, బుషిపాక యాదగిరి, ఆంజనేయులు, లింగస్వామి, చంద్రశేఖర్, గిరి, నాగరాజు,  బోడ విజయ్,గోపి తదితరులు పాల్గొన్నారు.

 

Read More రక్తదానంతో ఆపదలో ఉన్న వారి ప్రాణాలు కాపాడవచ్చు: డీసీపీ అనురాధ.

 

Tags: