భగవద్గీత పారాయణం, కంఠస్థల పరీక్షలో ఉత్తమ ప్రతిభ పురస్కారం అందుకున్న తేలుకుంట్ల రాజకుమారి చంద్రశేఖర్
On
విశ్వంభర, చండూరు: మైసూర్ లో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి దత్త పీఠంలో సోమవారం గీతా జయంతి సందర్భంగా సామూహిక మత్ భగవద్గీత పారాయణం, కంఠస్థ పరీక్షల నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన నల్లగొండ జిల్లా చండూరు గ్రంథాలయ కమిటీ మాజీ చైర్మన్ తేలుకుంట్ల రాజకుమారి-చంద్రశేఖర్ కు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి చేతుల మీదుగా బంగారు పతకం అందుకున్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మత్ భగవద్గీత పారాయణం చేయాలని తద్వారా మనః శాంతి నీ పొందాలని ఈ సందర్భంగా రాజకుమారి కోరారు. ఈ కార్యక్రమంలో తనకు సహకరించిన కంఠస్థ పరీక్షల కోసం నేర్పించిన గురువులకు, సహా పారాయణ కర్తలకు, కుటుంబం సభ్యులకు, బంధు మిత్రులకు, ప్రతి ఒక్కరికీ ఆమె కృతఙ్ఞతలు తెలియజేశారు.



