గుండెపోటుతో కాచం ఫౌండేషన్ సభ్యులు  బాసాని లక్ష్మణ్ మృతి - నివాళులు అర్పించిన కాచం ఫౌండేషన్ చైర్మన్ డా. కాచం సత్యనారాయణ 

గుండెపోటుతో కాచం ఫౌండేషన్ సభ్యులు  బాసాని లక్ష్మణ్ మృతి - నివాళులు అర్పించిన కాచం ఫౌండేషన్ చైర్మన్ డా. కాచం సత్యనారాయణ 

నార్కెట్‌పల్లి ,విశ్వంభర :-నకిరేకల్ నియోజకవర్గం నార్కట్ పల్లి మండలంలోని అమ్మనబోలు గ్రామానికి చెందిన కాచం ఫౌండేషన్ సభ్యులు  బాసాని లక్ష్మణ్ గుండె పోటుతో హఠాత్మరణం చెందడం జరిగింది.మరణ వార్త విషయం తెలుసుకున్న కాచం ఫౌండేషన్ చైర్మన్ , వి3 న్యూస్ ఛానల్, విశ్వంభర దిన పత్రిక అధినేత డా. కాచం సత్యనారాయణ  అమ్మనబోలు గ్రామానికి చేరుకొని మృత దేహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.కుటుంభ సభ్యులను ఓదారుస్తూ ధైర్యంగా ఉండాలని, అండగా ఉంటానని ప్రగాఢ సానుభూతి తెలియజేసారు.ఈ కార్యక్రమంలో కాచం ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు 

Tags: