హుస్నాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరండి
- డిగ్రీ అడ్మిషన్లకు చివరి అవకాశం
- జూలై 20 నుండి 26 వరకు దోస్త్ స్పెషల్ ఫేజ్ రిజిస్ట్రేషన్
విశ్వంభర, హుస్నాబాద్: ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల, హుస్నాబాద్‌లో చేరేందుకు చివరి అవకాశం లభించింది. 2026–27 విద్యా సంవత్సరానికి డిగ్రీ ప్రవేశాల కోసం తెలంగాణ ప్రభుత్వ డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ ద్వారా నిర్వహిస్తున్న స్పెషల్ ఫేజ్ (చివరి విడత) రిజిస్ట్రేషన్లు జూలై 20 నుంచి 26 వరకు కొనసాగనున్నాయని కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ విజయగిరి బిక్షపతి తెలిపారు. శాతవాహన విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల, హుస్నాబాద్‌లో బీకాం (కంప్యూటర్ అప్లికేషన్స్), బీఎస్సీ ఫిజికల్ సైన్స్ (మ్యాథమెటిక్స్–ఫిజిక్స్–కంప్యూటర్ సైన్స్), బీఎస్సీ లైఫ్ సైన్స్ (బోటనీ–జువాలజీ–కెమిస్ట్రీ), బీఏ (ఎకనామిక్స్–హిస్టరీ–పొలిటికల్ సైన్స్) కోర్సులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. కళాశాలలో అనుభవజ్ఞులైన అధ్యాపకులు, ఆధునిక కంప్యూటర్, సైన్స్ ల్యాబ్‌లు, స్మార్ట్ క్లాస్‌రూమ్‌లు, విశాలమైన గ్రంథాలయం, క్రీడా మైదానం, ఎన్‌ఎస్‌ఎస్ కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాల పెంపు వంటి ప్రత్యేక సౌకర్యాలు ఉన్నాయని తెలిపారు. అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని వివరించారు. విద్యార్థులు తమ ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌తో దోస్త్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ పూర్తి చేసి, వెబ్ ఆప్షన్లలో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, హుస్నాబాద్ ను ఎంపిక చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు హుస్నాబాద్ మినీ స్టేడియం సమీపంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణాన్ని సంప్రదించాలని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ విజయగిరి బిక్షపతి కోరారు.