ఉద్యమంలో విలేకరుల పాత్ర మరువలేనిది. - ఉద్యమకారుల సంక్షేమ సంఘం చైర్మన్ డా. కాచం

విలేకరులకు ఘన సన్మానం.

విశ్వంభర, ఎల్బీనగర్ :-తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విలేకరులకు సన్మాన కార్యక్రమాన్ని ఎల్బీనగర్ లోని శ్రీకాంత్ చారి విగ్రహం వద్ద తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం చైర్మన్ డా. కాచం సత్యనారాయణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులకు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కాచం సత్యనారాయణ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్ర పత్రికల యజమాన్యాలు తెలంగాణ విలేకరులను ఇబ్బందులకు గురిచేసిన ఎంతో ధైర్యంతో మేము చేసే కార్యక్రమాలను ప్రజలకు తెలిసేలా చేరవేయడంలో వారీ పాత్ర గణనీయమని తెలిపారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విలేకరులను సన్మానించుకోవడం గొప్ప విషయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం నాయకులు పల్లె వినయ్ కుమార్, కె.వి రంగారెడ్డి, కొత్త రవికుమార్, కాచం సాయి, పెద్ద సంఖ్యలో విలేకరులు, తదితరులు పాల్గొన్నారు.

🕒 02 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/the-role-of-journalists-in-the-movement-cannot-be-forgotten/article-16136

Tags: