వడ్డెర సంఘం సమస్యల పరిష్కారానికి రాజకీయ పార్టీలు కృషి చేయాలి
: రాష్ట్ర అధ్యక్షురాలు కుంచపు రమ
విశ్వంభర, జగద్గిరిగుట్ట: జగద్గిరిగుట్ట వడ్డెర సంఘం అధ్యక్షుడు యాదగిరి పిలుపు మేరకు గురువారం నిర్వహించిన వడ్డెర సంఘం ముఖ్య సమావేశానికి అఖిల భారత వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు, మెడిటేషన్ గురువు కుంచపు రమ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సమావేశాన్ని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ, వడ్డెర కులానికి చెందిన ప్రజలను రాజకీయ నాయకులు కేవలం ఓట్ల కోసమే కాకుండా వారి సామాజిక, ఆర్థిక సమస్యలను పరిష్కరించే దిశగా చిత్తశుద్ధితో కృషి చేయాలని కోరారు. అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, నాయకులు వడ్డెర సంఘం సభ్యులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా రాళ్లు కొట్టే కూలీలు తీవ్ర ఆర్థిక, ఉపాధి సమస్యలను ఎదుర్కొంటున్నారని, వారి సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. వడ్డెర కులానికి చెందిన కుటుంబాల అభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పన, సంక్షేమ పథకాల అమలు విషయంలో ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాలని ఆమె కోరారు. వడ్డెర సంఘం ఐక్యంగా పనిచేస్తూ తమ హక్కుల సాధన కోసం పోరాటం కొనసాగించాలని, సంఘ సభ్యులందరూ సమిష్టిగా ముందుకు రావాలని కుంచపు రమ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వడ్డెర సంఘం నాయకులు, సభ్యులు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.