దిల్ సుఖ్ నగర్ డిపో ముందు ఆర్టీసీ కార్మికుల ధర్నా
విశ్వంభర, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మె రెండో రోజు కొనసాగుతున్న నేపధ్యంలో సమ్మెకు సంఘీభావంగా దిల్ సుఖ్ నగర్ డిపోలోని ధర్నా కు టిజెఎంయూ ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజు , తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ కాచం సత్యనారాయణ మద్దతు పలికారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నలభై ఎనిమిది వేల ఆర్టీసీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఆర్టీసీ విలీనం , పీఆర్సీ, పే స్కేల్ , యూనియన్ ల ఏర్పాటు వంటి విషయాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిగణనలోకి తీసుకొని సమస్యలను పరిష్కరించాలని ఈ సందర్బంగా వారు అన్నారు. ఆర్టీసీ కోసం మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి అంశాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డిపో ప్రెసిడెంట్ సైదాచారి, డిపో కార్యదర్శి , రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అరుణ, డిపో జేఏసీ ముఖ్య నాయకులు వెంకటయ్య , నిరంజన్ , ఐవికె రెడ్డి, మోహన్ , తెలంగాణ శంకర్, కె ఎన్ రెడ్డి, జె పి రెడ్డి ,శేఖరు, కరుణాకరు, ఎండి జాంగిర్, ఎండి హర్షద్ , రాజు, డిపో ఉద్యోగులు పాల్గొన్నారు.



