శ్రీ వాసవి సేవా సమితి రాష్ట్ర మహిళా రాజకీయ విభాగ్ చైర్మన్ గా మోరిశెట్టి నివేదిత

విశ్వంభర, సూర్యాపేట: శ్రీ వాసవి సేవా సమితి రాష్ట్ర మహిళా రాజకీయ కమిటీ చైర్మన్ గా సూర్యాపేట మునిసిపల్ చైర్ పర్సన్ మోరిశెట్టి నివేదిత లక్ష్యాది నియామకమయ్యారు. ఈ మేరకు ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మున్సిపల్ చైర్ పర్సన్ నివాసములో శ్రీ వాసవి సేవాసమితి వ్యవస్థాపక  జాతీయ అధ్యక్షులు డాక్టర్ పూరి సురేష్ శెట్టి నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ , నాకు అవకాశం కల్పించినందుకు పూరి సురేష్ శెట్టి కి ధన్యవాదాలు తెలిపారు. శ్రీ వాసవి సేవాసమితి చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలకు  నా వంతుగా సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి సేవా సంస్థ జిల్లా అధ్యక్షులు బచ్చు పురుషోత్తం ప్రధాన కార్యదర్శి దేవర్శెట్టి నాగరాజు కోశాధికారి సోమ ప్రవీణ్ కుమార్ గౌరవ సలహాదారులు గోపారపు రాజు సబ్యులు గుండా వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

🕒 22 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/morishetty-is-reported-to-be-the-chairman-of-the-state/article-16843

Tags: