మేమెంతో మాకంత వాటా కావాలి: దాసోజు లలిత

మేమెంతో మాకంత వాటా కావాలి: దాసోజు లలిత

విశ్వంభర, బాగ్ లింగంపల్లి:  సమాజంలో సగభాగం ఉన్న మహిళలకు మేమెంతో మాకంత వాటా కావాలని తెలంగాణ సబండ శక్తి అధ్యక్షురాలు దాసోజు లలిత డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాదు బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మహిళా రాజకీయ రిజర్వేషన్లు- డి లిమిటేషన్ అనే అంశం పై చర్చ గోష్టి జరిగింది. 33 శాతం మహిళా బిల్లులో బీసీ మహిళల ఉప కోటా లేకపోవడం అత్యంత భాదకరమన్నారు. ఈ దేశంలో అత్యధిక జనాభా కలిగిన మహిళల పై చిన్న చూపు చూడడం సరైంది కాదన్నారు. శ్రామిక మహిళల రాజకీయ వాటా పై అన్ని పార్టీలు చిన్న చూపు చూస్తున్నాయని విమర్శించారు. 1951లో డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ బీసీ మహిళలకు ఉపకోటా కల్పించాలని కోరగా నాటి పెద్దలు ఒప్పుకోలేదని అప్పటి నుంచి ఇప్పిటి వరకు మహిళల పై వివక్షత కొనసాగుతుందని అన్నారు. సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి మాట్లాడుతూ... మహిళా రిజర్వేషన్ బిల్లును కుట్ర పూరితంగా కలిపారని విమర్శించారు. సమాజంలో సగభాగం ఉన్న మహిళలకు 50 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు మహిళల పై చిత్త శుద్ధిని ప్రదర్శించకుండా నటిస్తున్నారని విమర్శించారు. దీన్ని మహిళా సమాజమంత వ్యతిరేకించి ఆయా రాజకీయ పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సబండ శక్తి కార్యదర్శి జి. పుష్ప, అడ్వకేట్ పేరం అలేఖ్య, అరుంధతి, ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షురాలు హేమ సుదర్శన్, వొగ్గు పర్వతాలు తదితరులు పాల్గొన్నారు.

Tags: