భువనగిరిలో పోచంపల్లి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ప్రారంభోత్సవం -

పాల్గొన్న ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

భువనగిరిలో పోచంపల్లి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ప్రారంభోత్సవం -

విశ్వంభర, యాదాద్రి భువనగిరి :-  జిల్లా కేంద్రంలో సోమవారం పోచంపల్లి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకును భువనగిరి శాసనసభ్యులు అనిల్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, బ్యాంకులు పేద, మధ్య తరగతి ప్రజలకు సేవలు అందించాలని తెలిపారు. చిన్న చిన్న వ్యాపారులకు కూడా రుణాలు ఇచ్చి ప్రోత్సహించా లన్నారు. బ్యాంకులు వ్యాపార దృష్టితోనే కాకుండా, సేవా దృక్పథంతో కూడా పనిచేయాలని ఈ సందర్భంగా బ్యాంకు యాజమాన్యానికి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి సూచించారు.  బ్యాంకు చైర్మన్ తడక రమేష్, డిసిఒ శ్రీధర్ మాట్లాడుతూ పోచంపల్లి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ 27 సంవత్సరాల క్రితం కొంగరి భాస్కర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అప్పటినుంచి ఇప్పటివరకు ప్రజలకు అనేక సేవలు అందిస్తుందని తెలిపారు. 272 కోట్ల రూపాయల పెట్టుబడితో బ్యాంకులనుప్రారంభించామని, ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 14 బ్రాంచ్ లను ఏర్పాటు చేయటం జరిగిందని, భువనగిరిలో 15వ బ్రాంచ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 465 కోట్ల రూపాయలతో వ్యాపారం నడుస్తుందని, ఇప్పటివరకు వివిధ వ్యాపారాల కోసం 210 కోట్లు అప్పులు ఇవ్వడం జరిగింద న్నారు. ప్రస్తుతం మా పోచంపల్లి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకులో 12,000 మంది అప్పులు రుణాలు పొందాలని తెలిపారు. 165 మంది సిబ్బంది మా బ్యాంకు ద్వారా ప్రజలకు సేవలు అందించడం జరుగుతుందనీ... ఈ బ్యాంకులో క్యాష్ డిపాజిట్ కు, క్యాష్ విత్ డ్రా కు చార్జీలు లేవన్నారు. మా బ్యాంకులో అతి తక్కువ అద్దెతో లాకర్ సిస్టం ఉందని, ఈ లాకర్ ను నెలలో ఎన్నిసార్లు అయినా కస్టమర్లు వచ్చి ఓపెన్ చేసుకోవచ్చు అని, లిమిట్ అనేది లేదని, దీనికి ఏ విధమైన ఛార్జీ కూడా ఉండదని వారు తెలిపారు. మా బ్యాంకులో ఖాతా ప్రారంభించిన పది నిమిషాల్లోనే చెక్ బుక్, డెబిట్ కార్డు, మొబైల్ బ్యాంకింగ్, ఏటీఎం కార్డు, యూపీఐ సేవలు అందించడంజరుగుతుందన్నారు. అతి తక్కువ వడ్డీతో అవసరమైన వారికి లోన్లు ఇవ్వటం జరుగుతుందన్నారు. బంగారు ఆభరణాలపై, జీవిత బీమా పట్టాలపై, పోస్టల్ సర్టిఫికెట్లపై తక్కువ వడ్డీతో రుణ సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. పోచంపల్లి మొబైల్ బ్యాంకింగ్ యాప్, యూపీఐ ద్వారా దేశంలోని ఏ బ్యాంకు ఖాతాకైనా తక్షణం నగదు బదిలీ సౌకర్యం మా బ్యాంకు కల్పిస్తుందని తెలిపారు. ముఖ్యంగా పోచంపల్లి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకులో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వటం జరుగుతుందనీ ప్రజలంతా మా బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా  ప్రజలకు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు వైస్ చైర్మన్ భారత రాజేంద్రప్రసాద్, డైరెక్టర్లు ఏలే హరి శంకర్, సూర్యపల్లి రమేష్, రాపోలు వేణు, గుండు కావ్య, కర్నాటి భార్గవ్, కొండమడుగు ఎల్ల స్వామి, కో అప్షన్ డైరెక్టర్లు బొట్టు భాస్కర్, మక్తాల నరసింహ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సీతా శ్రీనివాస్, బ్యాంకు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Tags: